ఇటీవ‌ల‌ కేర‌ళ‌లో ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నాలుగు రోజుల ప‌సికందును చైల్డ్‌హోంలో ప‌డేసాడు ఓ వ్య‌క్తి. కూతురు ప్రేమ వివాహం చేసుకున్న‌ద‌నే అక్క‌సుతో ఈ ప‌నికి ఒడిగ‌ట్టాడు. దీంతో అక్క‌డి నుంచి ఆ బిడ్డ ఒంగోలుకు చేరిన‌ది. ప్ర‌కాశం జిల్లాలోని ఓ దంపతులు ఆ ప‌సికందుకును ద‌త్త‌త తీసుకుని అన్నీ తామూ చూసుకుంటున్నారు. చిన్నారి కాలికి మ‌ట్టిఅంట‌కుండా కంటికి రెప్ప‌లా చూసుకుంటున్న త‌రుణంలో పిడుగు లాంటి వార్త వ‌చ్చి ప‌డింది. ఆ బిడ్డ క‌న్న త‌ల్లి కోర్టుకు ఎక్కిన‌ది. తాను ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డంతో అది ఇష్టంలేని త‌న తండ్రి ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు అని, త‌న బిడ్డ‌ను తిరిగి అప్ప‌గించాల‌ని కేర‌ళ ముఖ్య‌మంత్రికి, స‌డ‌బ్ల్యూసీ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసారు.

న‌వ‌మాసాలు మోసి క‌న్న ఆ చిన్నార‌ని ఇత‌న‌కు వెంట‌నే అప్ప‌గింకాల‌ని కేర‌ళ‌కు చెందిన అనుప‌మ కోరింది. కోర్టు ఆ ప‌సికందును తీసుకొచ్చి డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. నిన్న కేర‌ళ సీడ‌బ్ల్యూసీ స‌భ్యులు పోలీసుల‌ను సైతం తీసుకుని ఒంగోలు లోని సీడ‌బ్ల్యూసీ అధికారుల‌ను క‌లిసారు.  ఆ చిన్నారిని ద‌త్త‌త తీసుకున్న దంప‌తులు  కేర‌ళ అధికారుల‌కు ప‌సి బాలుడిని  అప్ప‌గించేందుకు ఒప్పుకున్నారు. తిరువ‌నంత‌పురం నుంచి ఏడాది బాలుడిని ద‌త్త‌త తీసుకొచ్చిన ప్ర‌కాశం జిల్లాకు చెందిన దంప‌తుల నుంచి బాలుడిని  కేరళ పేరూర్‌ పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు.

ఆ ప‌సిబిడ్డ‌ను కేర‌ళ అధికారులు తీసుకెళ్లారు. డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌రువాత సొంత త‌ల్లికి అప్ప‌గించేందుకు ఏర్పాట్ల‌ను సిద్ధం చేస్తున్న‌ట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్ర‌క్రియ క‌న్న ముందు ఆ బిడ్డ త‌ల్లిదండ్రుల‌పై విచార‌ణ చేప‌డుతున్నారు అధికారులు. నిజంగానే బిడ్డ‌ను కోల్పోయిందా లేన ఆ త‌ల్లి వ‌దిలించుకుందా అనే కోణంలో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డీఎన్ఏ మ్యాచ్ అయినా విచార‌ణ ముగిసిన త‌రువాత‌నే బిడ్డ‌ను త‌ల్లికి అప్ప‌గించాల‌ని పోలీసులు నిర్ణ‌యించుకున్నారు. మ‌రోవైపు అనుపమ తండ్రిపై పేరూర్ పోలీసులు కేసు న‌మోదు చేసారు. పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రిపిన త‌రువాత ఆ బిడ్డ‌ను ఎక్క‌డికి త‌ర‌లించాల‌నే విష‌యాన్ని కోర్టు నిర్ణ‌యించిన త‌రువాత‌నే అధికారులు త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకోనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: