
ఇక, ప్రజలు కూడా రోడ్డెక్కి.. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు... భారీ ఎత్తున ఉద్య మించారు. దీంతో సర్కారు ఏదో ఒక రూపంలో వెనక్కి తగ్గుతుందని అందరూ అనుకున్నారు. రాజంపేట ననుంచి జిల్లా కేంద్రంగా మార్చాలని భావించిన డిమాండ్‌కు సానుకూలంగా స్పందిస్తుందని.. భావించా రు. అయితే.. అనూహ్యంగా.. సర్కారు తన నిర్ణయానికే.. కట్టుబడింది. రాయచోటి కేంద్రంగానే అన్నమ య్య జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక.. ప్రభుత్వ చీఫ్ విప్.. గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారని అంటున్నారు.
రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకుంటున్న ఆయనపై ఇక్కడి ప్రజలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పాటు విషయంలో ఆయన చక్రం తిప్పారు. దీనికి సర్కారు సానుకూలంగా స్పందించింది. అయితే.. ఒత్తిళ్లువచ్చినా.. గడికో ట ఎవరినీ పట్టించుకోకుండా.. వ్యవహరించారు. దీంతో ఇప్పుడు రాయచోటి కేంద్రంగానే జిల్లా ఏర్పాటు అయింది. ఇంత వరకు గడికోట సక్సెస్ అయ్యారు. అయితే.. ఇప్పుడు అసలు సమస్య ను ఆయన ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తిగా మారింది.
ఎలాగంటే.. నియోజకవర్గంలో తాగునీటికి ఎద్దడి ఉంది. అదేసమయంలో సాగు నీటికి కూడా సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ఎలా ఎదుర్కొంటారనేది ప్రధాన ప్రశ్న. అదేసమయంలో ప్రభుత్వ భూములు కూడా తక్కువగా ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు.. మౌలిక సదుపాయాలు వంటివి కూడా ఎమ్మెల్యేకు ఇబ్బందిగానే మారనుంది. ఎందుకంటే.. ఆయన పట్టుబట్టి.. రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఏర్పాటులో సక్సెస్ అయినా.. అభివృద్ధి విషయం మాత్రం ఆయనను ఇరుకున పెడుతోందని అంటున్నారు. మరి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.