
అంతే కాదు.. వాటికి సరిపడా సిబ్బందిని అక్కడ నియమించాలని సీఎం జగన్ సూచించారు. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయంపై సీఎం సమీక్ష నిర్వహించారు. సుమారు 45వేల స్కూళ్లలో ఇంటర్న్‌నెట్ సౌకర్యం కల్పించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా స్కూళ్లకు ఇంటర్నెట్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు.
అంతే కాదు.. సెప్టెంబరు నెలాఖరుకల్లా అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. డ్రాప్‌అవుట్స్ లేకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్.. ఇంటర్మీడియట్లో కూడా బైజూస్ కంటెంట్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తర్వాత దశలో ట్యాబులు పంపిణీకి కూడా సన్నద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.
కేజీబీవీల్లో కూడా ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అకడమిక్ స్ట్రెంగ్త్ కోసం పనిచేయాలన్న సీఎం జగన్... అకడమిక్ క్యాలెండర్ 2023–24 ను విడుదల చేశారు. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలిపిన అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో టాప్ 10 ర్యాంకులను 64 మంది విద్యార్థులు సాధించారని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.