పోక‌చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నేరెండంటా!- అనే సామెత‌.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర త్య‌క్షంగా క‌నిపిస్తోంద‌ట‌! ఏకులా వ‌చ్చి మేకయ్యే వాళ్లు ఎక్క‌డో ఒక‌రిద్దరు క‌నిపిస్తారు. అయితే, ఇప్పుడు ఏ పీలో మేకుల్లాంటి వారు అధికార పార్టీలో చాలా మందే క‌నిపిస్తున్నార‌ని ఆ పార్టీ నేత‌లే `చెవిలో చిన్న‌`గా `పెద్ద` విష‌యాన్నే చె ప్పుకొంటున్నారు. ముందు మమ్మ‌ల్ని పార్టీలో చేర్చుకుంటే చాలు.. అనే స్థాయి నుంచి టికెట్ ద‌క్కించు కుంటే.. హ‌మ్మ‌య్య అనుకునే ప‌రిస్థితి వైసీపీలో చాలా కాలం రాజ్య‌మేలింది. గ‌త ఏడాది ఎన్నిక‌ల ముం దు కూడా త‌మ‌కంటే త‌మ‌కు టికెట్ కావాలంటూ.. నాయ‌కులు లోట‌స్‌పాండ్ ద‌గ్గ‌ర చ‌క్క‌ర్లు చుట్టి.. జ‌గ‌న్‌ను చంక‌ల‌కెత్తుకున్నారు. 

 

ఇలా టికెట్లు సంపాయించుకున్న నాయ‌కులు గెలుపుగుర్రం ఎక్కారు. అదృష్ట‌వ‌శాత్తు.. ఎన్ని అడ్డంకు లు ఎదురైనా. ఎవ‌రెన్ని కుట్ర‌లు ప‌న్నినా.. వైసీపీ వాట‌న్నింటినీ ఛేదించుకుని అధికారంలోకి వ‌చ్చింది. దీం తో అప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాలు ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌రిమిత‌మైతే.. అంత‌ర్గ‌త రాజ‌కీయాలు ఆ త‌ర్వాత వైసీపీలో తెర‌దీసుకున్నాయి.  ఒక నాయ‌కుడిపై ఒక‌రు పైచేయి సాధించుకునే క్ర‌తువులో చాలా జిల్లాల్లో వైసీపీ ఇబ్బందు ల్లో ప‌డిపోయింది. మ‌రీ ముఖ్యంగా ఇప్పుడు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారం `తెగ‌దు.. సాగ‌దు..` అన్న‌ట్టుగా త‌యారైంది. పార్టీలో ఆయ‌న ఆధిప‌త్య రాజ‌కీయాలు చేయాల‌నుకున్నారు. అయితే, ఇలా సాగ‌ద‌నే విష‌యాన్ని అధిష్టానం.. ప‌రోక్షంగా ఆయ‌న‌కు సంకేతాలు ఇచ్చింది. 


దీంతో ఆయ‌న రోడ్డున ప‌డ్డారు. ప్ర‌భుత్వాన్ని విప‌క్షానిక‌న్నా ఎక్కువ‌గానే తిప్పలు పెట్టారు. ఈ క్ర‌మంలోనే పార్టీ కీల‌క నాయ‌కుడు.. రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి నేరుగా ఆయ‌నకు షోకాజ్ నోటీసు పంపిం చారు. అయితే, దీనికి రాజుగారు స‌మాధానం ఇవ్వ‌కుండా.. మ‌రో కొత్త మెలిక పెట్టారు. `పోక‌చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా..` అనే సామెత‌ను గుర్తు చేస్తూ.. అస‌లు వైసీపీ ఉనికినే ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఈ విష‌యం మ‌రోరూపు సంత‌రించుకుంది. ఎంపీ ఏకంగా వైసీపీ గుర్తింపునే ప్ర‌శ్నార్థ‌కం చేసి.. అధిష్టానాన్నే డిఫెన్స్‌లోకి నెట్టాల‌ని అనుకుంటున్నారా? అనేది  కీల‌క సందేహం. తాజాగా ఈ విష‌యంపైనే వైసీపీ నేత‌ల ఫోన్లు మార్మోగుతున్నాయి. 

 

కీల‌క నాయ‌కులు ఒక‌రికొక‌రు ఫోన్లు  చేసుకుని మ‌రీ ఈ విష‌యాన్ని చ‌ర్చించుకుంటున్నారు. ``అన్నా.. ఇప్పుడు మ‌న పార్టీ ప‌రిస్థితి ఏమంటావ్‌?. ఉంటుందా?   ఊడుతుందా?`` అని సీనియ‌ర్ల‌ను నియోజ‌క ‌వ‌ర్గం లో కీల‌కంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో వారు.. కీల‌క‌మంత్రుల‌కు ఫోన్లు చేసి.. ``అన్నా.. ఇప్పుడు మ‌నోళ్లు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తారంటావా?  అస‌లు ఏం జ‌రుగుతుంది?  పార్టీకేమ‌న్నా ప్ర‌మాద‌మా?  మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయా? `` అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మొత్తంగా ఎంపీ ర‌ఘురామ ‌కృష్ణ‌రాజు ఏకులా పార్టీలోకి ప్ర‌వేశించి మేకులా వ్య‌వ‌హ‌రిస్తు న్న తీరులో రోజుకో ట్విస్టు ఎదుర‌వుతుండ డంతో వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. దీంతో ఎవ‌రు.. ఎవ‌రికి ఫోన్లు చేసి మాట్లాడుకుంటున్నా.. ``అన్నా.. పార్టీ ప‌రిస్థితి ఏంటి?`` అనే ప్ర‌శ్నే తెర‌మీదికి వ‌స్తోంది. 


దీనికి స‌మాధానంగా కొంద‌రు వైసీపీ సీనియ‌ర్ మోస్టులు చెవిలో చిన్న‌గా చెప్పుకొం టున్న మాట ఏంటంటే ... ``ఎంపీ ర‌ఘు విష‌యాన్ని అధిష్టానం ప‌క్క‌న పెట్టేసింది. దీనిపై పెద్ద‌గా ఎవ‌రూ ప‌రిశీలించాల్సిన అవ‌స ‌రం లేద‌ని కూడా అధిష్టానం సిగ్న‌ళ్లు ఇచ్చింది. సో.. ర‌ఘు ఏమై పోయినా.. ఏమ‌న్నా.. కూడా ఎవ‌రూ ప‌ట్టిం చుకోవాల్సిన ప‌నిలేదు. సోమ‌వారం.. ఆయ‌న‌కు గ‌ట్టి షాక్ ఇచ్చేందుకు జ‌గ‌న్ వ్యూహం సిద్ధం చేసుకున్నా రు. కాబ‌ట్టి ఎవ‌రూ ఏమీ ఆందోళ‌న చెందొందు. అదే స‌మ‌యంలో ఎల్లో మీడియాకు ఎలాంటి లీకులు  ఇవ్వొద్దు!``అనే! మొత్తంగా ఎంపీ ర‌ఘు విష‌యంలో రోజుకో ర‌కంగా మారుతున్న ప‌రిణామాలు.. ఇంటా బ‌య‌టా  చ‌ర్చ నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: