ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలను పట్టించుకునేంత టైం ఉండటం లేదు. ఇక తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలను కొన్ని విషయాలలో తోటి వారితో పోల్చడం మంచిదే. కానీ అన్ని విషయాలలో కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అదేపనిగా పిల్లల్ని తోటి వారితో పోల్చి, వారిని మానసికం గా ఒత్తిడికి గురిచేస్తే అనుకున్న మార్పు రాకపోగా సమస్య మీరింత పెరిగిపోతుంది. చిన్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్న నేపధ్యంలో పెద్దలు ఈ పోలికల విషయంలో తప్పనిసరిగా ఆలోచించవలిసిందే.

ఇక పిల్లకు సంబంధించిన ఏ మార్పు అయినా రోజులు గడిచే కొద్దీ రావలిసిందే కానీ అప్పటికప్పుడే జరిగిపోదు అని గుర్తు పెట్టుకోండి. అందుకే పిల్లలధోరణి ,అలవాట్ల విషయం లో ఒక్కసారిగా మార్పు రావాలనుకోవటం సరయినది కాదు అని గమనించండి. వారిని ఎక్కువగా ఒత్తిడి అభద్రతకు గురిచేస్తే భయపడి ఇల్లు విడిచి పోవటం, గాయపరచుకోవటం వంటివి చేసే ప్రమాదం ఉంది.

అయితే ఆహారం తినడం, ఆడుకోవడం వంటి విషయాల్లో తోటి వారితో పోల్చినప్పుడు పిల్లలు ఆనందంగా పోటీపడతారు. చేతి వేళ్ళు ఒకలాఉండవు కదా, ఒక తల్లికి పుట్టినంత మాత్రాన పిల్లలందరూ ఒకేలా ఉండరు అని గుర్తుపెట్టుకోవాలి.  ప్రతి బిడ్డకూ కొన్ని ప్రత్యేక లక్షణాలు, అలవాట్లు, ఆలోచనలు ఉంటాయి. వాటిని అనుసరిస్తూనే నేటి ప్రపంచ అవసరాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దాలి. ఇందుకు పెద్దలకు అవగాహన, నైపుణ్యం, ఓర్పు అవసరం.

ఇక పిల్లలు పోట్లాడుకుంటే మీరు ఒకరి పక్షంలోనే ఉండవద్దు. ఇలా చేస్తే రెండో వారికి మీ మీద, తోబుట్టువు మీద ద్వేషం ఏర్పడుతుంది. ఇద్దరు పిల్లలున్నప్పుడు ఒకరిని తిట్టడం మరొకరిని పొగడటం లాంటివి కూడా అస్సలు చేయకూడదు. అస్తమానం పిల్లని ప్రతి విషయంలో తోటి వారితో పోల్చితే, వారిలో ప్రతికూలమైన ఆలోచనా విధానం ఏర్పడి ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా ఆలోచించటం, పనిచేయటంమొదలు పెడతారు. కొత్త వారితో కలవలేకపోవటం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడడం వంటివి వస్తాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: