డాక్టర్లు డాక్టర్లను...లాయర్లు లాయర్లను, కలెక్టర్లు కలెక్టర్లను, యాక్టర్లు యాక్టర్లను వివాహం చేసుకోవడం ఇప్పటి వరకూ మనం చూశాం. కానీ
ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేని వివాహం చేసుకోవడం అరుదనే చెప్పాలి. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు
యువ నేతలు త్వరలోనే
పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వారే
అదితి సింగ్, అంగద్.
అదితి సింగ్, అంగద్ సింగ్ ఇద్దరూ
కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేలు. దేశమంతా
మోడీ హవా ఉన్నా.. ఇద్దరూ ఎమ్మేల్యేలుగా గెలిచారు. వీరిద్దరూ ఒకే ఏడాది ఎమ్మెల్యేలుగా భారీ మెజార్టీతో గెలిచి సత్తా చాటారు. ప్రస్తుతం వీరిద్దరూ త్వరలోనే పెళ్లితో ఒకటవుతున్నారు. ఇద్దరూ
కాంగ్రెస్ ఎమ్మేల్యేలే కానీ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ
కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్‌తో.. పంజాబ్‌లో షహీద్ భగత్‌సింగ్ నగర్
ఎమ్మెల్యే అంగద్ సింగ్ షైనీ వివాహం ఈ నెల 21న ఢిల్లీలో జరగనుంది.
అదితిసింగ్, అంగద్ ఇద్దరూ ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందినవారు. అదితి
తండ్రి అఖిలేష్ కుమార్ సింగ్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవగా... అంగద్ సింగ్ షైనీ
తండ్రి దిల్బాగ్ సింగ్ నవాన్షహర్
అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు స్థాయిలో ఆరు సార్లు ఎన్నికయ్యారు. ఇక ఇక పంజాబ్ అసెంబ్లీలో అంగద్ సింగ్ షైనీ మిగతా ఎమ్మెల్యేల కంటే వయసులో చిన్నవాడు. అదే విధంగా అదితి సింగ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో వయసులో చిన్న ఎమ్మెల్యే. అంగద్ కంటే అదితి వయసులో నాలుగేళ్లు పెద్ద. ఇప్పటికే వీరిద్దరి వివాహానికి ప్రముఖ అతిధులకు ఆహ్వానాలు అందాయి. అదితి, అంగద్ వివాహ రిసెప్షన్ ఈ నెల 23న నిర్వహించనున్నారు.