కొందరు పోర్న్ అంటే పడి చచ్చేవాళ్లు పోర్న్ వీడియోలను చూడకుండా ఉండలేరు. మూడో కంటికి తెలియకుండా పోర్న్ చూడాలని ఇన్‌కాగ్నిట్ మోడ్ లో పోర్న్ చూస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వారి డేటాను గూగుల్, ఫేస్ బుక్ మొదలైన కంపెనీలు పట్టేస్తున్నాయి. పోర్న్ సైట్ల ద్వారా హ్యాకర్లు ఫోన్లు, కంప్యూటర్లలోకి ప్రవేశిస్తున్నట్లు గతంలో కొన్ని కేసుల్లో పోలీసులు నిర్ధారించారు. 
 
పోర్న్ చూసిన వారి వీడియోలను రికార్డ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే రికార్డు చేసిన వీడియోలను స్క్రీన్ షాట్లు పంపి బెదిరించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. పోర్న్ వీడియోల ప్రభావంతో కొందరు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తున్న ఇంటర్నెట్ డేటా స్మార్ట్ ఫోన్లలో బూతు చిత్రాలను చూసే వారి సంఖ్యను పెంచుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. 
 
పోర్న్ చూస్తున్నవారు అందులోని శృంగారానికి, వాస్తవ శృంగారానికి మధ్య తేడాను గమనించలేక సైకలాజికల్ గా తీవ్రంగా ప్రభావితమవుతున్నట్టు తేలింది. పోర్న్ చూసే వాళ్లలో 30 శాతం మహిళలు కూడా ఉంటున్నారని ఒక అధ్యయనంలో తేలింది. ఒక అధ్యయనంలో పోర్న్ చిత్రాలను చూసే వారికి భవిష్యత్తులో నిజంగా శృంగారంలో పాల్గొన్నపుడు ఆసక్తి ఉండదని తేలింది. తరచుగా నీలి చిత్రాలను చూసేవారు దాంపత్య జీవితంలో పూర్తి సంతోషాన్ని పొందలేరని పరిశోధనలో తేలింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: