ప్రతి ఒక్కరు పరుపు మీద పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది అని , పరుపులను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. పరుపులు బయట మనకు షాపుల్లో రకరకాల సైజుల్లో, రకరకాల మెటీరియల్ తో తయారు చేసినవి దొరుకుతాయి.. అయితే ఈ పరుపు ఎవరైతే కొనుక్కోవాలి అనుకుంటున్నారో, అలాంటివారు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే సూచనలను ఒకసారి గమనించాల్సి ఉంటుంది.. అయితే పరుపు కొనేటప్పుడు ఎలాంటి సూచనలు పాటించాలో..ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..


ఇక నాణ్యమైన పరుపు ఉన్నప్పుడే.. నాణ్యమైన నిద్ర కూడా వస్తుంది అనే విషయం గుర్తుంచుకోవాలి.. నిపుణులు చెప్పిన వివరాల మేరకు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి..

పరుపులో రకాలు చాలా ఉంటాయి.. ఏమిటంటే పరుపు లోపల పాకెట్ స్ప్రింగ్స్, లేటెక్స్ మ్యాట్రెసెస్, మెమరీ ఫోమ్ మాట్రిసెస్ ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. కాబట్టి మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు కంఫర్ట్ గా ఉండే వాటిని కొనుగోలు చేయడం మంచిది. ఆర్థోపెడిక్ పరుపులు మరీ అంత గట్టిగా ఉండవు.. మరి అంత మెత్తగా ఉండవు..మధ్యస్తంగా ఉంటాయి.. క్వాలిటీ విషయంలో రాజీ పడాల్సిన అవసరమే లేదు.. మంచి క్వాలిటీతో.. నాలుగు లేయర్ల తో ఈ పరుపును డిజైన్ చేసి ఉంటారు.. కాబట్టి  ఎటువంటి సందేహం లేకుండా ఆర్తోపెడిక్ పరుపులను కొనుగోలు చేయవచ్చు..


అంతేకాదు ఈ పరుపు కొనేటప్పుడు మీ మంచానికి ఫిక్స్ అయ్యి ఉందా లేదా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ఒకవేళ చిన్నదైనా,  పెద్దదైనా సరే పరుపు సపోర్ట్ లేకుండా పోవడం వల్ల పాడైపోతుంది.. అంటే ముఖ్యంగా కంఫర్ట్ గా ,  వాడుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి.. మీ పరుపును కొనుగోలు చేసేటప్పుడు మంచం బట్టి కొనుగోలు చేయడం మంచిది. ఎంత మందంగా ఉండాలి అనే విషయాన్ని కూడా చూసుకోవాలి.. కంఫర్ట్ అలాగే సపోర్టు కూడా పరుపు యొక్క మందం పైన ఆధారపడి ఉంటుంది.. ఆర్థోపెడిక్ పరుపులు ఎంచుకున్నట్లు అయితే, మంచి నాణ్యతతో పాటు మంచి స్టాండర్డ్ గా ఉంటాయి. నిద్ర పోవడానికి  బాగా ఉపయోగపడతాయి.. నడుము నొప్పి, వెన్నునొప్పి ఉండేవాళ్లకు ఈ పరుపులు ఒక మంచి మెడిసిన్ గా పని చేస్తాయని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: