ఎండలు ఎక్కువగా మండిపోతున్నాయి ప్రతిరోజు ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తూనే ఉన్నాయి. దీంతో జనం ఎండదెబ్బకు చాలా విల విల లాడి పోతున్నారు. ఇలాంటి ఎండల వల్ల ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్య బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందట. ముఖ్యంగా తిమ్మిర్లు, వడ దెబ్బ లు , అలసట వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. హైదరాబాదులో ఆస్పత్రులకు ఎక్కువగా వేడి సంబంధిత వ్యాధులకు సంబంధించిన వారే వస్తున్నారట. వీటిపై వైద్యులు కూడా స్పందించడం జరిగింది. అయితే కొన్ని పనులు చేయడం వల్లనే ఇలాంటి రోగాల బారిన పడవలసి వస్తోంది అని తెలియజేస్తున్నారు వైద్యులు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎక్కువ సేపు  కింద కూర్చోవడం వల్ల పెయిన్ కిల్లర్ తో పాటుగా ఈ సమ్మర్ లో హిట్ స్టోక్ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కేర్ హాస్పిటల్ లో జనరల్ డాక్టర్ జి నవోదయ మాట్లాడుతూ.. వేడి గాలి వీస్తున్న టువంటి ఫ్యాన్ దగ్గర కూర్చోవడం వల్ల.. వీటికి సంబంధించిన కొన్ని రోగాలు వస్తాయని తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో రోగి తనకు తెలియకుండానే డీహైడ్రేషన్ కు గురవుతారని తెలియజేశారు. ఇక అంతే కాకుండా పెయిన్ కిల్లర్ రావడం కూడా డీహైడ్రేషన్ కు కారణం అవుతుందని వైద్యులు తెలిపారు.



అయితే ఇంకా హాస్పిటల్ లోకి హీట్ స్టోక్, వడ దెబ్బ కేసులు ఇంకా రాలేదు అన్నారు. రోగులు అధిక వేడి వల్ల తిమ్మిరి, అలసట ఎక్కువ అవుతోందని మాత్రమే గుర్తించినట్లుగా వైద్యుడు నవోదయ తెలిపారు. ఇక మరొక కేర్ మెడిసిన్ సీనియర్ హెచ్.ఓ.డి డాక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ మే నెలలో ఎండలు తీవ్రంగా పెరుగుతాయి.. ఈ రెండు నెలలు ఆస్పత్రులు కిడ్నీ లో రాళ్ళు ఎక్కువగా ఉన్నాయని వస్తూ ఉంటారు అని తెలియజేశారు. అయితే ఇందుకు కారణం ఎక్కువ ఉష్ణోగ్రత లేదంటే పనిచేసే రకంలో మార్పులు ఉండొచ్చు అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: