టాలీవుడ్ దిగ్గజ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి గురించి మన తెలుగు వారి తో పాటు పలు ఇతర భాషల ఆడియన్స్ కి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా తన సినిమా కెరీర్ ని ఆరంభించిన చిరంజీవి ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనంతరం హీరోగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని తన అద్భుతమైన యాక్టింగ్, డ్యాన్సింగ్ టాలెంట్ తో అనతికాలంలొనే టాలీవుడ్ లో సుప్రీం హీరో గా అలానే మెగాస్టార్ గా గొప్ప క్రేజ్ ని కోట్లాదిమంది ప్రేక్షకాభిమానుల ప్రేమని చూరగొని సినీ కెరీర్ పరంగా అత్యున్నత శిఖరాలను అందుకున్నారు.

ఇక దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ లో తిరుగులేని నెంబర్ వన్ స్టార్ హీరోగా ఇంకా కూడా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవల రాజకీయాల్లో కొన్నేళ్ల పాటు కొనసాగి ఆపై ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఎప్పుడు చిరంజీవి తన లైఫ్ గురించి మాట్లాడినా తన తల్లితండ్రుల గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. తన చిన్నప్పుడు తాము జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం అని, అయితే అమ్మ, నాన్న మాత్రం మమ్మల్ని పద్ధతులు మీరకుండా ఎంతో ఒద్దికగా పెంచారని చెప్తూ ఉంటారు.

అలానే ముఖ్యంగా తన లైఫ్ లో తన వెంట ఆంజనేయ స్వామి ఎప్పుడూ ఉంటారని, తాను ఏ పని ప్రారంభించాలి అని భవించినప్పుడల్లా మనసులో ఆయనని ఒకసారి తలుచుకుంటే చాలు ఆ పని చక్కగా ఆనందంగా పూర్తి అవుతుందని, అలానే తన కెరీర్ లో ఎదురైన ఎన్నో సవాళ్లని, ధైర్యంగా ఎదుర్కొని నేడు హీరోగా ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు కారణం అని మెగాస్టార్ అంటుంటారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: