మా వార్ ముదిరి పోయింది. మంచు విష్ణు..ప్రకాష్ రాజ్ ఫ్యానెల్స్ మ‌ధ్య పోరు తీవ్ర స్థాయికి చేరుకోగా.. ప్ర‌కాష్ రాజ్ మాత్రం రెండు రోజులుగా చాలా దూకుడుగా ముందుకు వెళుతుండ‌డంతో పాటు విష్ణు, మోహ‌న్ బాబును టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఇక మంచు విష్ణు కూడా ప్ర‌కాష్ రాజ్ విమ‌ర్శ‌ల‌కు అంతే ఘాటుగా కౌంట‌ర్లు ఇస్తూ వ‌స్తున్నారు.

అయితే అంత‌ర్గ‌తంగా చూస్తే మా ఎన్నిక‌ల‌లో రెండు కులాల మ‌ధ్య యుద్ధంతో పాటు రెండు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పోరు కూడా క‌నిపిస్తోందా ? అంటు అవున‌నే చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. విష్ణు ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో కొంద‌రు పెద్ద‌ల‌ను క‌లిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. విష్ణు క‌లిసిన వారిలో కృష్ణంరాజు - కృష్ణ - బాలకృష్ణ ఉన్నారు. స‌రే విష్ణు క‌లిసిన వారిలో అన్ని కులాల వారు ఉన్నా కూడా ప్ర‌ధానంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం విష్ణుకు స‌పోర్ట్ చేస్తుంద‌ని అంటున్నారు.

ఇక ప్ర‌కాష్ రాజ్‌కు ప్ర‌ధానంగా మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉంది. ప్ర‌కాష్ కు స‌పోర్ట్ చేస్తోన్న వారిలో కాపులే ఎక్కువ ఉన్నారంటున్నారు. జీవిత‌, హేమ కూడా ఈ వ‌ర్గం వారే. ఇక మాలో పొలిటిక‌ల్ వార్ కూడా ఉంద‌ని అంటున్నారు. ఇక విష్ణు ప్యానెల్ కు ప‌రోక్షంగా వైసీపీ వాళ్లు స‌పోర్ట్ చేస్తున్నార‌ని అంటున్నారు. ఏపీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎన్నిక‌ల‌కు త‌మ‌కు సంబంధం లేద‌ని పైకి చెప్పినా కూడా .. లోప‌ల మాత్రం ఇండ‌స్ట్రీలో ఉన్న వైసీపీ సానుభూతి ప‌రులు స‌పోర్ట్ చేస్తున్నారంటున్నారు.

అసలే టాలీవుడ్ లో పట్టు సడలిపోతోంది. ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో నాన్ కమ్మవారే కీలకంగా వున్నారు. హీరొలు కూడా వారే పెరుగుతున్నారు. ఇక మిగిలింది నిర్మాతలు మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో మంచు విష్ణు పోటీ అన్నది మరోసారి ఆ వర్గాన్ని నిలబెడుతుందా? దెబ్బ మీద దెబ్బ పడుతుందా? అన్నది తేల్చేలా వుంది.

గమ్మత్తేమిటంటే కాపు వర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరవెనుక ప్రకాష్ రాజ్ వర్గం కోసం గట్టిగా కృషి చేస్తోంది. కానీ విష్ణు వెనుక మాత్రం కమ్మ వర్గం ఎవ్వరూ నిల్చున్నట్లు కనిపించడం లేదు. పైగా వైకాపా వైపు విష్ణు ఫ్యామిలీ మొగ్గినప్పటి నుంచి కమ్మవారికి ఆ కుటుంబం మీద కాస్త గుర్రుగా వుంది. ఇలాంటి టైమ్ లో వైకాపా మంత్రి తమకు ఈ ఎన్నికతో సంబంధం లేదని ఓ స్టేట్ మెంట్ పడేసారు. దీని వెనుక కూడా మెగాస్టార్ మంత్రాంగం వుందని టాక్ వినిపిస్తోంది.

ఇక టీడీపీ కి ఈ ఎన్నిక‌ల‌కు పెద్ద‌గా లింక్ లేక‌పోయినా కొంద‌రు టీడీపీ వాళ్లు కూడా విష్ణుకే స‌పోర్ట్ చేస్తున్నారంటున్నారు. ఇక ప్ర‌కాష్ రాజ్‌కు తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ స‌పోర్ట్ ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఈ కులాలు, పొలిటిక‌ల్ వార్ లో ఎవ‌రు స‌పోర్ట్ చేసిన వారు అంతిమంగా గెలుస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: