సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వివిధ జోనర్లకు సంబంధించిన సినిమాలు ఎప్పుడు విడుదల అవుతూ ఉంటాయి. ఫ్యాక్షన్ సినిమాలకు మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.  అంతే కాదు అటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన ఫ్యాక్షన్ చిత్రాలు తెరకెక్కాయి. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి బ్లాక్బస్టర్ విజయాలను కూడా సాధించాయ్. అయితే నాటి తరం లోనే కాదు నేటి తరంలో కూడా ఎంతో మంది హీరోలు ఫ్యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలని తన ఖాతాలో వేసుకున్నారు.



 ఇలా ఇటీవలి కాలంలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న  సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా ఏది అంటే తెలుగు ప్రేక్షకులు అందరూ చెప్పే పేరు అరవింద సమేత వీర రాఘవ సినిమా అని.  ఈ సినిమా విడుదలైనప్పుడే కాదు ఇప్పటికీ టీవీలో వస్తుందంటే చాలు తెలుగు ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోయి మరి ఈ సినిమా చూస్తూ ఉంటారు. అంతలా  తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ సినిమా.  నట విశ్వరూపానికి కేరాఫ్ అడ్రస్ అయిన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.  మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో ఫ్యాక్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది.



 తాతల కాలంలో ఒక చెట్టు కింద 5 రూపాయల కోసం మొదలైన ఫ్యాక్షన్.. ఏకంగా తండ్రులు కొడుకులు వరకు సాగిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే రెండు ఊర్ల మధ్య  ఎప్పుడు రక్తపాతం జరుగుతూ ఉంటుంది  ఎప్పుడు ఒకరిని ఒకరు దారుణంగా నరికి చంపుకోవడం లాంటివి ఈ సినిమాల్లో చూపిస్తారు. అదే సమయంలో హీరో ఇక వారందరినీ మార్చేందుకు చేసే ప్రయత్నం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలా ఫ్యాక్షనిస్టులు అందరినీ మార్చేందుకు హీరో కూడా ఫ్యాక్షనిస్ట్ గా మారిపోతాడు. ఒకానొక సమయంలో హీరో ఏకంగా ఉగ్రరూపం దాల్చి అందరిని నరుక్కుంటూ పోతాడు. ఇలా అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా  అదిరిపోయింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: