జబర్దస్త్ అనసూయ సినిమాలలో హీరోయిన్ల కంటే ఎక్కువగానే ఆఫర్లను కొట్టేస్తోంది. దర్శక నిర్మాతలు కూడా ఈ మధ్యకాలంలో హీరోయిన్లను పట్టించుకోవడం మానేసి , అనసూయ వైపే చూస్తూ ఉండడం గమనార్హం. అనసూయ హీరోల లాగ థ్రిల్లర్ సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్న విషయం తెలిసిందే. అందుకే ప్రేక్షకులు కూడా ఈమె సినిమాలు చూడడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందడానికి ట్రై చేస్తున్న అనసూయ, ఇప్పుడు పుష్ప సినిమా తర్వాత మరో కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.పేపర్ బాయ్ సినిమా తో తెలుగు లో అందరిని ఆకట్టుకున్న దర్శకుడు జయశంకర్.. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో అనసూయ ఒక సినిమా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి చివరి దశకు వచ్చినట్లు సమాచారం. మరో రెండు వారాలలో ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు కూడా వెళ్లడిస్తాము అన్నట్లుగా చిత్రం యూనిట్ తెలుపుతోంది.. ఇక తాజాగా లైబ్రరీలో అనసూయ ఒక పుస్తకం చూస్తూ ఉన్నట్టుగా సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు..

ఈ ప్రీ లుక్ లో అనసూయ ముఖం మనకు కనిపించడం లేదు..కానీ ఆమె లుక్ అలాగే అవుట్ ఫిట్ చూస్తుంటే ఖచ్చితంగా మరో విజయాన్ని అందుకుంటుంది అనే నమ్మకం అయితే అభిమానులలో రావడం గమనార్హం. ఈ సినిమా చూసిన తరువాత జబర్దస్త్ అనసూయ మరొక సినిమా ఎప్పుడు అంటూ ఆతృతగా అడుగుతున్నారు అభిమానులు. ఇప్పటికీ పుష్పా సినిమాలో దాక్షాయణి గా విలన్ పాత్ర పోషిస్తున్న అనసూయ .. తన  పోస్టర్ తో పాటు ఇప్పుడు వచ్చిన ప్రీ లుక్ పోస్టర్  కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.. ఈ రెండు సినిమాలు కనుక విడుదల అయితే ఆమెను సినీ ఇండస్ట్రీలో మరింత బిజీ ఆర్టిస్ట్ గా మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని అందరూ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: