కాగా ఈ సినిమాలను చేస్తూనే చరణ్ బడా డైరెక్టర్ శంకర్ ని కూడా లైన్ లో పెట్టేసాడు. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి భారీ బడ్జెట్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుండగా..దిల్ రాజు సుమారు 100కోట్లతో ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఇక చరణ్ ప్రస్తుతం ఉపాసన చెల్లెలు అనుష్ పెళ్లివేడుకల్లో బిజీగా ఉన్నారు. తన మరదలి పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు ఈ మెగా వారసుడు. అన్నీ పనులను దగ్గరుండి చూసుకుంటూ అల్లుడిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
కాగా చెర్రీ.. తన మరదలి సంగీత్ సెలబ్రేషన్స్ టోటల్ బాధ్యతలను బిగ్‌బాస్ కంటెస్టెంట్ యానీ మాస్టర్‌కు అప్పగించినట్లు యానీ మాస్టర్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. సంగీత్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ప్రతి విషయాని యానీ మాస్టర్ దగ్గరుండి చూసుకునేలా చరణ్ ఆమెకి ఫుల్ రైట్స్ ఇచ్చారట. దీంతో యానీ మాస్టర్ కి బంఫర్ వరించిన్నట్లైంది. ఇక ఈ పెళ్లిలో డ్యాన్స్ వేయడానికి యానీ మాస్టర్ తన టీమ్‌తో ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ వీడియోలను తన అభిమానులతో సోషల్ మీడియాలో వేదికగా పంచుకుంటుంది. ఇక దీని పై యానీ మాస్టర్ రెస్పాండ్ అవుతూ.."15 ఏళ్లుగా మీరు నాపై నమ్మకం ఉంచుతూ.. ఇలాంటి పెద్ద బాధ్యతలను అప్పగించినందుకు రామ్‌చరణ్‌కు స్పెషల్ థ్యాంక్స్" అంటూ ఇన్ స్టా లో ఓ పోస్ట్ చేసింది.