ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

పుష్ప మూవీ లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ లో ఫాహాద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. రావు రమేష్ , సునీల్ , అనసూయమూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా ,  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాన్ని సాధించడంతో పుష్పా పార్ట్ 2 పై జనాల్లో అంచనాలు పెరిగిపోయాయి.  

పుష్ప పార్ట్ 1 మూవీ లో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రలో డి గ్లామర్ గా కనిపించి ప్రేక్షకులను అలరించాడు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో స్టైలిష్ మూవీ లలో నటించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 లో మాత్రం డీ గ్లామర్ రోల్ లో కనిపించే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా పుష్ప పార్ట్ 1  లో డీ గ్లామర్ గా కనిపించి అలరించిన అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 లో నడి వయస్సు ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే పుష్ప పార్ట్ 2 సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: