రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ది వారియర్ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది. లింగస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ మసాలా చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం వంటి అంశాలు ఈ సినిమాపై ఇంతటి ఆసక్తి ఏర్పడడానికి ప్రముఖ కారణం అయితే ఈ సినిమాలో కంటెంట్ బాగో లేకపోవడంతో సినిమాను భారీ ఫ్లాప్ గా నిర్ణయించారు.

ఆ విధంగా రామ్ కు వరుసగా రెండవ పరాజయం ఎదురైనట్లు అయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ ఆ తర్వాత చేసిన రెడ్ సినిమాతో పరవాలేదనిపించుకున్నాడు. అందులో కంటెంట్ కొంచెం అటు ఇటు అయినా కూడా సినిమాకు ఆ మాత్రం కలెక్షన్లైనా వచ్చేలా చేసుకున్నాడు అంటే దానికి అది మాస్ సినిమా అవడమే.  ఇప్పుడు విడుదలైన వారియర్ సినిమా మాత్రం కంటెంట్ దగ్గర నుంచి ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ అవ్వలేదు దాంతో మొదటి ఆట నుంచే నెగటివ్ రివ్యూలను ఈ సినిమా సొంతం చేసుకుంది. 

రొటీన్ కమర్షియల్ సినిమాగా దీన్ని తేల్చేశారు చూసిన ప్రతి ఒక్కరు. అందరూ కూడా పెదవి విరిచేశారు. అయితే నెగటివ్ టాకీ వచ్చినప్పటికీ మాస్ సినిమా కావడంతో బీసీ సెంటర్స్ లో ఈ సినిమాకు బాగానే కలెక్షన్స్ రాబడుతోంది. ఆ విధంగా నిర్మాతలకు ఈ సినిమా ద్వారా భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది రామ్ అభిమానులు మాస్ సినిమాల వెంటపడి ఆయన తన ఫోకస్ ను పూర్తిగా మలిచివేశారు అనిపిస్తుంది అని అంటున్నారు. వాస్తవానికి కథ బాగుండి ఎలాంటి సినిమా చేసినా కూడా రామ్ కు సూట్ అవుతుంది అని వారు సూచనలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: