యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొన సాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ని సంపాదించు కున్నాడు . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు.

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయికి మించి తొమ్మిది భాషల్లో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఈ మూవీని  భారీగా రూపొందించాలని ఉద్దేశంతో కొరటాల శివమూవీ కథలో మరిన్ని మార్పులు చేర్పులు చేస్తూ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా రత్న వేలు పనిచేయనున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ కొన్ని కిలోల బరువు తగ్గనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: