డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరు కూడా అనేక మార్గాలను ఎంచుకుంటారు. ముఖ్యంగా కొంతమంది నెలవారీగా ప్రభుత్వం , ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ జీతాలు తీసుకుంటే మరి కొంతమంది సొంతంగా బిజినెస్ చేస్తూ ఉంటారు. చాలామంది ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక ఇలా వ్యాపారాలు చేస్తూ మంచి లాభం పొందుతున్నారు. అయితే ఏదైనా వ్యాపారం పెట్టేటప్పుడు ఎంత పెట్టుబడి అవుతుంది? లాభాలు ఎలా వస్తాయి? ఎలాంటి బిజినెస్ మొదలు పెట్టాలి? ఇలా ప్రతి అంశాన్ని కూడా వారు ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం రావాలని ఆలోచించేవారికి ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది.

అదేమిటంటే పూల వ్యాపారం.. ఇక మీ వ్యవసాయానికి సంబంధించిన ఏ వ్యాపారమైనా.. మీరు చేయాలనుకున్నట్లయితే ముందుగా ఇలాంటి వ్యాపారం మంచి ఆదాయాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. పూల వ్యాపారానికి పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం లేదు. కాబట్టి కాస్త ప్రాథమిక సమాచారం మీకు తెలిస్తే సరిపోతుంది. ఇక ఎక్కడైనా సరే ఈ పూల పెంపకాన్ని మొదలు పెట్టవచ్చు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో పువ్వులకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటి ధరలు కూడా అధికంగానే పలుకుతాయి. పెళ్లిళ్లు , పుట్టినరోజు వేడుకలు, ఫంక్షన్లు ఇలా ఏ చిన్న సెలబ్రేషన్ జరిగినా సరే ఎక్కువగా పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు.

ఇకపోతే కొన్ని పువ్వులు , వాటి సొంత లక్షణాలను కలిగి ఉంటే మరికొన్ని పువ్వులు ఔషధాలలో పరిమళానికి ఉపయోగించేదిగా ఉంటాయి. ఇక నీటి కొరత లేని చోట పొలాలను ఎంచుకొని మీ వ్యాపారం మొదలు పెట్టవచ్చు. ముఖ్యంగా వాతావరణానికి అనుగుణంగా  ఉండే లిల్లీ పూలతో మీరు వ్యాపారం చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. ఏడాది పొడవునా పూసే ఈ పువ్వులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇకపోతే 25 వేల రూపాయల ఖర్చుతో మీరు ఈ వ్యాపారం మొదలు పెడితే.. ఎకరానికి 75 వేల రూపాయల వరకు లిల్లీ పూల ద్వారా లాభం వస్తున్నట్లు సమాచారం . ఇక రాయలసీమ ప్రాంతాలలో ఈ పువ్వుల సాగు ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: