పాయల్ రాజ్ పుత్.. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్ర అలాంటింది.. ఆమె అందాల ఆరబోత కూడా అందుకుతోడైంది. అందుకేనేమో ఇప్పుడు ఆమె అందాలే పెట్టుబడిగా ఆర్ డి ఎక్స్ లవ్ అనే సినిమా రెడీ అయిన సంగతి తెలిసిందే. పాయల్ రాజ్ పుత్.. బోల్డ్ కంటెంట్‌తో మొదటి చిత్రంలోనే నెగిటివ్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు ఈ అందాల భామ నటిస్తున్న ఈ చిత్రంలో తేజస్ కంచెర్లకు ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్‌భాను దర్శకుడు.
ఈ భామ ఇప్పుడు తన అందాలన్నీ ఆరబోసింది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కుర్రకారును యమా ఆకట్టుకుంటోంది. బోల్డ్ చిత్రానికి ఎక్కువ నీలి చిత్రానికి తక్కువ అన్నట్టుంది ఈ టీజర్. అందుకే కుర్రకారును యమా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ టీజర్ 3 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. ముఖ్యంగా కుర్రాళ్లు ఈ టీజర్ చూసి ఫిదా అవుతున్నారు.
ఇకపోతే పాయల్ అందం, అభనయం దానితో పాటు బోల్డ్ క్యారెక్టర్స్‌తో తెలుగు ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్‌ని సృష్టించిందనే చెప్పాలి. హీరోయిన్స్ అంటే ఎలాంటి పాత్రలైనా చెయ్యాలి అన్న ట్రెండ్‌ను తీసుకొచ్చింది. ఈ సారి ఆర్డిఎక్స్ అందాలతో ప్రేక్షకుల గుండెల్లో బాంబు పేల్చాలని ప్రయత్నిస్తోంది. ఈ సినిమాలో హీరోకి పెద్దగా పేరు లేదు. అందుకే ఆమె అందాన్నే ఎరగా వేస్తున్నారు
సినిమా స్టిల్స్‌లో. పాయల్ రాజ్‌పుత్ నాభి ప్రదర్శనతో కూడిన ఫోటోలను తెగ వదులుతోంది టీమ్. మరి కుర్రకారు ఆర్ఎక్స్100 సినిమాని చూసేందుకు విరగబడ్డట్లు ఈ సినిమాకి కూడా వస్తారా అనేది చూడాలి. సరే.. సినిమా సంగతి ఏమో కానీ.. టీజర్ మాత్రం తెగ హిట్టైపోతోంది.