అనుపమ పరమేశ్వరన్.. అందాల యువరాణిగా మారిపోయింది. సంప్రదాయ దుస్తులతో అందమైన ముస్తాబుతో అదరొకొడుతోంది. చక్కగా అలంకరించుకున్న అందాల యువరాణి అనుమప కొత్త ఫోటోలు తనే సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ చిత్రాలు కుర్రాళ్ల మతి పోగొట్టేలా ఉన్నాయి. సంప్రదాయంలో ఎంత అందం ఉందో ఈ పిక్స్ చెబుతున్నాయి.


ఎప్పుడూ హాట్ హాట్ అందాలతోనో.. లేకపోతే..లేటెస్ట్ మూవీ స్టిల్స్ పోస్టు చేసే అనుపమ.. తాజగా పోస్టు చేసిన ఫోటోలు రమణీయంగా ఉన్నాయి.. అనుపమ సోయగాలు చూపు తిప్పుకోనివ్వడం లేదు. అంత బాగా వచ్చాయి ఈ స్టిల్స్.. అదిరే అందాలు.. చక్కటి అభినయం ఉన్నా అనుపమకు పెద్దగా ఛాన్సులు రావడం లేదు.


ఈ మ‌ధ్యే తెలుగులో రాక్షసుడు సినిమా చేసింది అనుపమ. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. ఇండస్ట్రీలో అందాలు ఆరబోయడం ఇష్టం ఉండని అతికొద్ది మంది హీరోయిన్లలో అనుపమ ఒకరు. అ..ఆ సినిమాతో తెలుగు వాళ్లకు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకుంది.


అప్పట్లో గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఆ త‌ర్వాత మాత్రం అదే జోరు కొన‌సాగలేదనుకోండి. అనుప‌మ ప‌ర‌మేశ్వరన్ కు ఇప్పుడు ఏ భాషలోనూ పెద్దగా సినిమాల్లేవు. దాంతో ఇదిగో ఇలా ఫోటోల్లో అందాలు ఆరబోస్తూ.. ఫోటో షూట్లు చేస్తూ గడపేస్తోంది. తను, తన అందం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రకృతి అందాల్లో దాగిపోయి అనుపమ ఇచ్చిన ఫోజులు కూడా బావున్నాయి. ప్రకృతి, స్త్రీ కలగలసిన అందం ఆవిష్కృతమవుతోంది. ఎప్పుడూ హాట్ హాట్ అందాలతోనో.. లేకపోతే..లేటెస్ట్ మూవీ స్టిల్స్ పోస్టు చేసే అనుపమ.. ఇలా సంప్రదాయ బద్దంగా ఫోటోలు పెడుతోంది ఈ మధ్య.


మరింత సమాచారం తెలుసుకోండి: