ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఉన్న ప్రేమ గురించికాని ఆయ‌న‌కున్న స్టార్ డ‌మ్ గురించి కాని ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌వ‌స‌రం లేదు. నిజం చెప్పాలంటే టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రొక‌రికి లేర‌ని చెప్ప‌వ‌చ్చు. కొందరు ప్రేమ వివాహాలు చేసుకొంటే…. మరికొందరు పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకోవ‌డం సాధారణ విషయమే. ఇక ప‌వ‌న్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొద‌టి పెళ్ళి బెంగుళూరు అమ్మాయి నందినికి ఇచ్చి ఇంట్లోవాళ్ళే కుదిర్చి చేసిన వివాహం అది. కానీ అనుకోకుండా వారిద్ద‌రు అభిప్రాయ బేధాలు వ‌చ్చి విడిపోయారు. ఆ త‌ర్వాత బ‌ద్రీ సినిమా టైంలోనే రేణుదేశాయ్‌తో ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌ర్వాత వారిద్ద‌రు చాలాకాలం పాటు స‌హ‌జీవ‌నం చేసి ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌న్నారు. త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీ స‌మ‌యంలో వ‌చ్చిన వివాదాల్లో రేణుదేశాయ్‌ని వివాహం చేసుకున్నారు. ఇద్ద‌రూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ప‌వ‌న్ అంటే రేణుకు చాలా ఇష్టంగా ఉండేద‌ట‌. ఆ త‌ర్వాత ఎందుకోగాని ప‌వ‌న్ క్యారెక్ట‌ర్ మీద రేణుకి విర‌క్తి వ‌చ్చింద‌ట‌. ఇంత‌కి ప‌వ‌న్‌లో రేణుకి నచ్చ‌ని విష‌యం ఏమిటంటే ప‌వ‌న్‌కి జాలి గుణం కాస్త ఎక్కువ ఎవైనా క‌ష్టాల్లో ఉన్నారంటే ఖ‌చ్చితంగా హెల్ప్ చేస్తాడు. 

 

అలాగే త‌న ఇంటికి వ‌చ్చి ఎవ‌రైనా క‌ష్టాలు చెప్పుకున్నా షూటింగ్ స‌మ‌యంలో ఎవ‌రైనా ఏదైనా ఇబ్బందులు చెపితే ఒక్క‌క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా ఆర్ధిక స‌హాయం చేసేవాడ‌ట‌. ఇలా ఆర్ధిక సాయం చేస్తూ దానాలు ఇస్తూ చాలా ఆస్తులు పోగొట్టుకున్నాడు. త‌న అన్న నాగ‌బాబుకి అండ‌గా ఒక ఇంటిని కూడా అమ్మేశాడు. ఇలాంటివ‌న్నీ న‌చ్చ‌కే ప‌వ‌న్‌కి రేణికి మ‌ధ్య విభేదాలు ఏర్ప‌డ్డాయి. త‌న క్యారెక్ట‌ర్ మార్చుకోమ‌ని ఎంత చెప్పిన ప‌వ‌న్ విన‌క‌పోవ‌డంతో రేణు ప‌వ‌న్ నుంచి విడిపోయింది అంటుంటారు. 

 

త‌ర్వాత కొన్నాళ్ళ‌కి మూడో పెళ్ళి చేసుకోవ‌డం అంద‌రికీ తెలిసిందే. ప‌వ‌న్ మూడో భార్య అన్నా లెజ‌నోవా ఇంగ్లీష్ సినిమాల్లో న‌టించేది. అయితే ప‌వ‌న్‌లానే ఆమె కూడా సంఘ‌సేవ చేస్తూ కోట్ల రూపాలను పోగొట్టుకుంది. త‌న‌కు న‌ట‌న‌మీద ఉన్న ఆశ‌క్తితో తెలుగులో కూడా సినిమాల్లో న‌టించింది. అప్పుడు ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకున్నారు. ఇద్ద‌రి వ్య‌క్తిత్వం ఒక‌ర‌కంగా ఉండ‌డంతో వీరిద్ద‌రు వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు హ్యాపీగానే ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: