టాలీవుడ్ లో చాలా మంది అమ్మ పాత్రలు చేసారు గాని నిండు గా ఉంటుంది అమ్మ పాత్రలకు అనే పేరు వచ్చిన నటులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక సుధా, అన్నపూర్ణమ్మ లాంటి వారికి తక్కువ కాలంలోనే మంచి పాత్రలతో గుర్తింపు వచ్చింది. కొంత మంది ఎక్కువ సినిమాలు చేసినా సరే పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు అనే చెప్పాలి. టాలీవుడ్ లో తక్కువ కాలంలో గుర్తింపు వచ్చిన వారిలో పవిత్రా లోకేష్ ఒకరు. స్టార్ హీరోలకు ఆమె అమ్మగా నటించి మెప్పించారు.

 

ఇక హీరోయిన్లకు కూడా ఆమె అమ్మగా నటించారు. ఇక ఆమె వ్యక్తిత్వం కూడా కాస్త దూకుడుగా ఉంటుంది అనే పేరు ఉంది. అటు తమిళంలో కూడా ఆమె కు వరుస అవకాశాలు వచ్చాయి. హీరోయిన్ గా చేసిన ఆమె కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు చేసింది. భావోద్వేగాలను సమర్ధవంతంగా ఆమె పండించింది. దీనితో తెలుగు దర్శక నిర్మాతలకు ఆమె ఫస్ట్ ఆప్షన్ అయ్యారు. ఈ మధ్య వరుసగా నటిస్తున్నారు ఆమె. శర్వానంద్ హీరోగా వచ్చిన ఇది మళ్ళీ మళ్ళీ రాని రోజు సినిమాలో ఆయనకు అమ్మగా నటించారు.

 

ఇక ఈమె పారితోషకం విషయంలో కూడా ఎక్కడా రాజి పడే అవకాశం ఉండదు అంటున్నారు కొందరు. చాలా వరకు ఆమె కోటి రూపాయలకు పైగానే డిమాండ్ చేస్తారని అంటారు. అయినా సరే ఆమె ను ప్రేక్షకులు ఆదరించారు. అయితే ఆమె నటన అన్ని సినిమాల్లో ఒకే విధంగా ఉంటుంది అని ప్రేక్షకులు అనడంతో కాస్త భిన్నంగా ఆమె ప్రయత్నం చేస్తున్నారు. 1994 సం.లో నటుడు అంబరీష్ సలహాపై పవిత్ర సినిమాలలో నటించింది. మిస్టర్ అభిషేక్ సినిమాలో ఆమె తొలి పాత్రను పోషించింది. అదే సంవత్సరంలో, ఆమె బంగారద కలశలో నటించింది. ఈ చిత్రాల ద్వారా సరైన గుర్తింపు రాకపోవడంతో, పవిత్ర తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మానవ వనరుల సలహా సంస్థ కోసం పనిచేయడం ప్రారంభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: