అను ఇమ్మాన్యుయేల్.. పేరు తెలియని తెలుగు కుర్రకారు ఉండరంటే నమ్మి తీరాల్సిందే.  2016లో నాని సరసన మజ్ను సినిమాతో తెలుగు తెరపైన మెరిసిన ఈ భామ అందానికి అప్పట్లో కుర్ర కారు ఫిదా అయిపోయింది. ఆ తర్వాత అను.. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, గోపీచంద్ ఆక్సిజన్ సినిమాల్లో నటించినప్పటికిని  అవి.. పెద్దగా ఆడలేక పోవడం వలన ఆమె ఒక్కసారిగా తెర మరుగవ్వడం మనకు విదితమే.

 

IHG

 

కొన్నాళ్లకు, తంతే.. బూర్ల గంపలో పడ్డట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం ఈమెకు దక్కింది. ఇక అజ్ఞాతవాసి సినిమాలో ఈమె ఎంపికవ్వడంతో ఆమె దశ, దిశ తిరిగిపోతుందని అంతా అనుకున్నారు.. కానీ, ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో, అను పరిస్థితి అధో గతిలో పడింది. మరలా కొన్నేళ్లు ఆమెకు సినిమా అవకాశాలు వెక్కిరించాయి.  

 

తరువాత కొన్నాళ్లకు, ఆమెకు వరుస మీద వరుస అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. మన టాలీవుడ్  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా కూడా భారీ ప్లాప్ అవడం వలన మరలా ఈమె సినీ జీవితం అగమ్య గోచరంగా తయారయ్యింది. ఇద్దరు పెద్ద హీరోలతో చేసిన సినిమాలు ప్లాపవ్వడంతో అను ఇమేజ్ బాగా డామేజ్ అయ్యింది. ఈ ఇద్దరు మెగా హీరోలు కావడం కోసం మెరుపు. ఇక తరువాత హీరో నాగ చైతన్యతో చేసిన శైలజారెడ్డి అల్లుడు కూడా పాపం ఈమెను దగా చేసింది. 

 

IHG

 

ఇక ఈమె చేసిన సినిమాల్లో ఒక్క హిట్ కూడా లేకపోవడంతో అను యెంత అందమున్నా దానితో అందలం మాత్రం ఎక్కలేకపోయింది. తదుపరి, 2019లో ఒకే ఒక్క తమిళ సినిమాలో మాత్రం నటించింది. కానీ అది కూడా వెక్కిరించడంతో... ఈమె జాతకం మీద పలువురు నిర్మాతలకు అనుమానం రావడంతో అక్కడితో ఈ తారకు తెర అవకాశాలు రావడం మందగించాయి. ఎన్ని విధాలుగా ప్రవర్తించినా ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి. రిటర్న్ ఆమె హైదరాబాద్ నుండి తిరిగి తన నివాసానికి సర్దుకునే సమయంలో... ఎడారిలో నీటి చినుకు మాదిరి...  హీరో అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా ఎంపికైనట్లు తాజా వార్త.. ఇక ఈ సినిమాతోనైనా ఆమె దశ తిరుగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: