బిగ్ బాస్ షో దక్షిణ భారత దేశంలో మొదటి రియాలిటీ షో. బుల్లితెరపై కోట్లాది మంది ప్రేక్షకుల మది గెలుచుకున్న షో బిగ్ బాస్. ఈ షో విజయవంతంగా మూడు సీజన్లు పూర్తీ చేసుకుంది. మొదటి సీజన్లో ఎన్టీఆర్ యాంకర్ గా చేసి ఈ షోకి మంచి స్టార్ డమ్ తీసుకొచ్చారు. తర్వాత వచ్చిన నాని కూడా మంచి క్రేజ్ తీసుకొచ్చారు. ముచ్చట్టగా మూడో సీజన్లో నాగార్జున తన యాంకర్ రింగ్ తో అందరి మెప్పు పొందారు. తాజాగా ఈ షో నాలుగో సీజన్ ప్రారంభించాడనికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ షోకి హోస్ట్ గా ఎవరు ఉండబోతున్నారు అనేదే ప్రధానాంశంగా మారింది.

 

 

అయితే రెండో సీజన్ సమయంలో ఎన్టీఆర్ తన బిజీ షెడ్యూల్స్ కారణంగా చేయలేకపోయారు. దీంతో రెండో సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. అయితే రెండో సీజన్‌లో కౌశల్ మాత్రం బిగ్‌బాస్ 2 విన్నర్‌గా పాపులర్ అయ్యాడు. ఇకపోతే బిగ్‌బాస్ వంటి ప్రోగ్రామ్‌ను తప్పు పట్టిన నాగార్జున కూడా మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం సంచలనంగా మారింది. నాగ్ కూడా ఈ షోను తనదైన సమయస్పూర్తితో మెప్పించాడు. మూడో సీజన్‌ కంప్లీటైన తర్వాత నాల్గో సీజన్‌కు హోస్ట్ ఎవరనే విషయం పై మాటా మంతీ నడుస్తోంది. 

 

 


ఇకపోతే నాలుగో సీజన్ కోసం మహేష్ బాబు పేరును పరిశీలించారు. కానీ బిగ్‌బాస్ యాజమాన్యం నాల్గో సీజన్ కోసం మళ్లీ నాగార్జుననే సంప్రదించినట్టు సమాచారం.  హోస్ట్‌గా నాగార్జున చాలా ఈజ్‌గా చేయడమే కాకుండా.. వివాదాలేవి రాకుండా మంచిగానే నడిపించారు. ఈ సీజన్లో షో పెద్దగా చాలా హుందా ప్రవర్తించిన విధానం షో నిర్వాహకులను ఆకట్టుకుంది. కానీ బిగ్‌బాస్ టీమ్ వాళ్లు ఎన్టీఆర్, మహేష్ బాబు ఇప్పటి కిప్పుడు షో చేయలేమని చెప్పడంతో నాగార్జునపై ఒత్తిడి పెంచినట్టు సమాచారం. మొత్తానికి బిగ్‌బాస్ 4 సీజన్ విషయంలో నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: