రౌడీ హీరో గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు యువతరంలో ప్రస్తుతం చాలా ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా .. ప్రేమకథతో సినిమాలు రావడంతో యువతరం వాళ్లని బాగా ఆకట్టుకుంది. అటు సినిమాలలో.. ఇటు నిజ జీవితంలో కూడా కరోనా బాధితులకు సహాయం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు విజయ్. ఇక అంతే కాకుండా తనదైన స్టైల్ తో ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో అమ్మాయిలను కూడా ఆకర్షిస్తున్నాడు ఈ యంగ్ డైనమిక్ హీరో విజయ్.

 


ఇటీవల బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కథానాయకురాలు చరిష్మా కూడా విజయ్ నటనకు ఫిదా అయిపోయారు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ తారలు కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అని తెలియజేశారు. ఈ లిస్టులో జాన్వీ కపూర్, ఆలియా భట్, ఆనణ్య పాండే పలు సందర్భాలలో విజయ్ తో నటించడం అంటే ఇష్టమని తెలియజేయడం కూడా చూశాము. ఈ లిస్టులో మరో బాలీవుడ్ బ్యూటీ అయిన అమైర దస్తూర్ కూడా ఇప్పుడు చేరుకుంది. 

 


ఇటీవల ఈ బ్యూటీ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ పై తనకు క్రష్ ఉందని తెలియజేయడం జరిగింది. అలాగే దక్షిణాది హీరోలలో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని ఆవిడ తెలియ చేసింది. నిజానికి అర్జున్ రెడ్డి సినిమాలో ఆయన చేసిన నటన చాలా మందిని ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఇక బాలీవుడ్ తారలు అయితే ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఎదురు చూస్తున్నారు. ఈ బ్యూటీ కూడా విజయ్ తో కలిసి ఒక సినిమా చేయాలని అనుకున్నట్లు తెలియజేసింది. ఆ సినిమా బాలీవుడ్ సినిమా అయితే ఇంకా బాగుంటుంది అని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక ఈమె మన తెలుగులో మనసుకు నచ్చింది, రాజుగాడు అనే సినిమాలో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: