మన తెలుగులో ఇప్పుడు త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పుడు చాలా వరకు బిజీ గా ఉన్నాడు. అగ్ర దర్శకులు చాలా మంది అతని తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయినా సరే ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. చిన్న చిన్న హీరోలు కూడా ఇప్పుడు ఆయన కోసం ఎదురు చూసే పరిస్థితి అయితే మన తెలుగులో ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక వార్త వచ్చింది. అది ఏంటీ అంటే త్రివిక్రమ్ ఇప్పుడు తమిళంలో అడుగు పెడుతున్నాడు అని. 

 

అవును అతను తమిళంలో ఒక సినిమా చేయడానికి గానూ ఆసక్తి చూపిస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ తో ఆయన ఒక సినిమాను ప్లాన్ చేసాడు. ఈ సినిమా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వాయిదా ఆపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చెయ్యాలి అనేది ముందే ప్లాన్ చేసుకున్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు అందులో భాగంగానే అతను  తమిళం లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో అతను ఎన్టీఆర్ తో సినిమా లేట్ అయితే  నానీ తో చెయ్యాలి అని భావించాడు. 

 

కాని నానీ కూడా అందుబాటు లో లేరు అని సమాచారం. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ తమిళంలో సినిమా చేస్తున్నాడు అని అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చూస్తే ఆయన తమిళంలో సినిమా చేస్తాడా లేదా అనేది సరిగా చెప్పడం అయితే దాదాపుగా కష్టమే అని చెప్పాలి. అక్కడ సూర్య తో ఒక సినిమాను చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి చేస్తాడా లేదా అనేది చూడాలి. త్వరలోనే స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: