కరోనా మన జీవితాల్లో చాలా మార్పులని తీసుకువచ్చింది. అప్పటివరకూ మనకు అలవాటు లేని వాటన్నింటినీ అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో ముఖ్యంగా మాస్కులు, శానిటైజర్ల గురించి చెప్పుకోవాలి. ఒకప్పుడు మాస్కులు హాస్పిటల్లో డాక్టర్లకి తప్ప ఎక్కడా కనబడేవి కావు. శానిటైజర్ అయితే చాలామందికి తెలియనే తెలియదు. అదెందుకు వాడతారో కూడా తెలిసేది కాదు. కానీ కరోనా వల్ల మాస్కులు, శానిటైజర్లు మన జీవితంలో భాగం అయ్యాయి.

 

కరోనా నుండి కాపాడుకోవడానికి మాస్కులు తప్పక ధరించాల్సిందే. భారతదేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అందువల్ల ప్రమాదం ఇంకా ఎక్కువ ఉండడంతో మాస్కులని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. 
అయితే మాస్కులు ధరించాలన్న విషయాన్ని ప్రభుత్వంతో పాటు సెలెబ్రిటీలు సైతం ఎంత చెబుతున్నా కొందరు వాటి విషయంలో తేలికపాటి అభిప్రాయంతోనే ఉన్నారు. అలాంటి వారు వారి ప్రాణాల్ని ప్రమాదంలో నెట్టుకోవడమే కాదు ఇతరుల ప్రాణాల్ని కూడా రిస్క్ లో పెడుతున్నారు.

 

 

అలాంటి వారికి కూడా అర్థమయ్యే విధంగా వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. వీ ఎఫ్ ఎక్స్ రూపంలో బాహుబలి సీన్లో ప్రభాస్, రానాలకి మాస్కులు తగిలించి మహిష్మతి రాజ్యంలో కూడా మాస్కులు అవసరం అని చూపించారు.
బాహుబలి సినిమాలో క్లైమాక్స్ ఫైట్ సీన్ లో ప్రభాస్, రానాల ఇద్దరి మొహాలు మాత్రమే తెర మీద కనిపిస్తాయి. నువ్వా నేనా అని చూసుకుంటున్నట్టు ఉండే ఈ సీన్ ని తీసుకుని వి ఎఫ్ ఎక్స్ సాయంతో వారిద్దరికీ మాస్కులని తగిలించారు.

 

ఈ మాస్కులు చాలా సహజంగా ఉన్నాయి. చిత్రీకరణ్ జరిగినపుడు నిజంగా మాస్కులు ధరించారేమో అన్నంత రియలిస్టిక్ గా ఉంది. ఈ వీడియోని  యునైటెడ్ సాఫ్ట్ అనే వీఎఫ్ ఎక్స్ సంస్థ తయారు చేసింది. ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా రాజమౌళి షేర్ చేసాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: