చాలా తక్కువ కాలంలో అటు  తమిళం లో ఇటు తెలుగు లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న దర్శకురాలు సుధా కొంగర. ఆమె సినిమాలు ఆమె చేస్తున్న హీరోలు అన్నీ కూడా ఆమెకు బాగానే కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవాలి. యువ హీరోలు అయినా స్టార్ హీరోలు అయినా సరే చాలా వరకు ఆమె స్వేచ్చగా సినిమాలు చేస్తారు అని అంటారు టాలీవుడ్ లో ఆమె గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఆమె కూడా చాలా వరకు రెండు భాషల్లో కూడా స్టార్ హీరోలను లైన్ లో పెట్టి సినిమాలు ఎక్కువగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇది పక్కన పెడితే.. 

 

ఇప్పుడు ఆమె తో రామ్ చరణ్ సినిమా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒక రన్నర్ జీవిత కథ ఆధారంగా ఆమె ఈ సినిమాఉ రామ్ చరణ్ తో చేసే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో ప్రచారం బాగానే జరుగుతుంది. నిజమా కాదా అనేది ఎవరికి తెలియదు గాని దీనిపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అనే చెప్పాలి. ఆమె ఇప్పటికే రామ్ చరణ్ కి ఒక కథ వినిపించారు అని ఆయన కూడా  ఆమె చెప్పిన కథ విని సినిమాను ఓకే అన్నారు అని టాక్. మరి నిజమా కాదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

 

రామ్ చరణ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కొరటాల  లేదా అనీల్ రావిపూడి లేదా సుధా కొంగర... ఇలా వీళ్ళతో ఎవరి తో అయినా సరే చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: