టాలీవుడ్ లో కీరవాణి, రాఘవేంద్ర రావు కాంబినేషన్ అనగానే స్టార్ హీరో లు కూడా ఆ కాంబినేషన్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. ఎన్టీఆర్ తో ఆయన చేసిన సినిమాలు అందించిన సంగీతం, రాజశేఖర్ లాంటి హీరోలకు కూడా అందమైన పాటలు అందించి వారి రేంజ్ ని ఒక స్థాయికి తీసుకుని వెళ్ళిన విధానం అన్నీ కూడా ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది.   ఇక అన్నమయ్య సినిమా సహా కొన్ని భక్తి రసా చిత్రాల్లో కీరవాణి అందించే సంగీతం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. ఇక ఆయన సంగీతంలో ఉండే మాధుర్యాన్ని సరిగా పట్టిన దర్శకుడు రాఘవేంద్ర రావు అని సినీ ప్రియులు కూడా అంటూ ఉంటారు. 

 

అది అలా ఉంటే అన్నమయ్య చిత్రానికి గానూ ఆయనకు జాతీయ అవార్డ్ వచ్చింది. చిరంజీవి సినిమాలకు కూడా ఆయన అందించిన సంగీతం అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి. దర్శకుడు ఎవరు అయినా సరే సినిమాలో ఒక స్థాయిని తీసుకొస్తారు. ఈ విషయం అన్నమయ్య సినిమా చూడగానే స్పష్టంగా అర్ధమవుతుంది. వారి ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం చాలా మంది ఎదురు చూసే వారు. హీరోలు అయితే కీరవాణి సంగీత దర్శకత్వం అనగానే... సినిమా చేయడానికి ముందుకు వచ్చే వారు. 

 

వారి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి అనే చెప్పాలి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అని వార్తలు వస్తున్నాయి. క్రిష్ పవన్ కళ్యాణ్ సినిమాలో సంగీత దర్శకుడి గా ఆయన చేస్తున్నారు. అలాగే రాజమౌళి తో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు అన్నీ కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది రానునాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: