నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగాదీష్. నాని వి నిరాశపరచాగా ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఆల్రెడీ శివ నిర్వాణతో నిన్ను కోరి సినిమా చేసి హిట్ అందుకున్నాడు నాని. టక్ జగదీష్ సినిమా ప్రస్తుతం సెట్స్ మీదౌంది. ఈ సినిమాలో నానితో పాటుగా జగపతి బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది.

కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేయగా టక్ జగదీష్ టీం లో ఒకరికి కరోనా రావడంతో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయని అన్నారు. అంతేకాదు నానితో పాటుగా టక్ జగదీష్ చిత్రయూనిట్ మొత్తం హోం క్వారెంటైన్ లో ఉంటున్నారని అన్నారు. అయితే ఈ వార్తలపై స్పందించిన శివ నిర్వాణ తన ట్విట్టర్ లో అన్ స్టాబబుల్ అంటూ మెసేజ్ పెట్టాడు. అంతేకాదు లొకేషన్ లో అంతా శానిటైజ్ చేసి షూట్ చేస్తున్న వీడియో షేర్ చేశాడు.

ఈ వీడియో చూస్తే టక్ జగదీష్ షూటింగ్ కు బ్రేకులు పడినట్టు అనిపించడం లేదు. నిన్ను కోరి, మజిలీలతో డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తున్న ఈ డైరక్టర్ తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ సినిమాలో నాని కొత్తగా కనిపిస్తాడని తెలుస్తుంది. తప్పకుండా నానితో చేసే ఈ సినిమాను కూడా హిట్ కొడతాడని అంటున్నారు.                                                                        



మరింత సమాచారం తెలుసుకోండి: