వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.... సినిమాతో సందీప్ కిషన్ తో జతకట్టి మొదటిసారిగా తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఇక అప్పటినుండి ఆమెకు పట్టం కట్టారు తెలుగు ప్రజలు... ఎన్నో సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది రకుల్. ఇలా ఎప్పుడూ తరచూ షూటింగులతో బిజీగా ఉండే రకుల్, ఇక సోషల్ మీడియాలో తన హవా చాటడం కొత్తేమి కాదు. ఎప్పుడూ ఏదో ఒక స్పెషల్ న్యూస్ తో సోషల్  మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తరచుగా పోస్టులు పెట్టడంతో పాటు సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉండడంలో ముందుంటుంది.మరీ ఈ లాక్ డౌన్ సమయంలో అయితే రకుల్ ప్రీత్ సింగ్ పోస్టులకు కొదవ లేదు... రకరకాల పోస్టులతో ఎంత సందడి చేసిందో అందరికీ తెలిసిందే.

అయితే  తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన గొంతును సవరించుకొని ర్యాప్ సాంగ్ తో సోషల్ మీడియాలో అల్లరి చేస్తోంది. ''కరే ని కర్దా ర్యాప్ ఛాలెంజ్'' లో పార్టిసిపేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది రకుల్. ''#CareNiKardaRapChallenge కు నన్ను నామినేట్ చేసినందుకు.. వీడియోను రూపొందించడానికి నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ అర్జున్ కపూర్. మీరు నాకు బాగా సహాయం చేసారు.. చివరికి డిఫరెంట్ గా ఈ సాంగ్ ను ముగించాను' అని పోస్ట్ పెట్టింది రకుల్. ఇక ఆ తర్వాత ఈ ఛాలెంజ్ కు బాలీవుడ్ నటుడు.. టీవీ హోస్ట్ అపరశక్తి ఖురానా ని రకుల్ నామినేట్ చేసింది.

అసలు ఈ ర్యాప్ సాంగ్ చాలెంజ్ ఎక్కడ మొదలైంది అనుకుంటున్నారా.....యోయో హనీ సింగ్ ''ఛలాంగ్'' సినిమా కోసం 'కరే ని కర్దా' ర్యాప్ పాడిన నేపథ్యంలో 'కరే ని కర్దా ర్యాప్ ఛాలెంజ్' క్రియేట్ చేసింది టీమ్. ఇందులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు భాగస్వామ్యులు అయ్యారు. నవంబరు 13న 'ఛలాంగ్' రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ ఛాలెంజ్ తో సినిమాని ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మోహతా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రాజ్ కుమార్ రావ్ - నుస్రత్ బరుచా హీరో హీరోయిన్లుగా నటించారు. చిత్ర యూనిట్ క్రియేట్ చేసిన ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ర్యాప్ పాడి.. ఈ ఛాలెంజ్ కి తన నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా నటించనున్న రకుల్ ప్రీత్ సింగ్ ని నామినేట్ చేసాడు. ఈ సవాలుకు స్వీకరించిన రకుల్.. అద్భుతంగా ర్యాప్ సాంగ్ పాడింది. రకుల్ ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఈ ర్యాప్ వీడియో వైరల్ గా మారి అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: