మొన్నటి వరకు కేవలం బాలీవుడ్లో హీరోలు మాత్రమే ఎక్కువగా సిక్స్ ప్యాక్ తో  కనిపించేవారు. కానీ టాలీవుడ్ హీరోలు మాత్రం ఎక్కువగా సిక్స్ ప్యాక్ పై దృష్టి పెట్టేవారు కాదు. ఈ ఈ క్రమంలోనే పలుమార్లు హీరోలపై కామెంట్లు కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం మాత్రం ప్రతి ఒక్కరు కూడా సిక్స్ ప్యాక్ ఫై  దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్  కాదు అంతకు మించి అనే రేంజ్ లో ప్రస్తుతం సిక్స్ ప్యాక్ తో  ఆశ్చర్యంలో ముంచెత్తుతూన్నారు ఎంతో మంది హీరోలు. యువ హీరోలు సీనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరూ కూడా తమ సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకులందరినీ అలరిస్తున్న విషయం తెలిసిందే.



 ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా సిక్స్ ప్యాక్ అనేది కామన్ గా మారిపోయింది. ఇక ఇప్పటి వరకు మెగా హీరోల విషయానికి వస్తే అల్లు అర్జున్ రామ్ చరణ్ కొన్ని సినిమాల్లో  సిక్స్ ప్యాక్ చేసి తమ బాడీతో ప్రేక్షకులను మైమరపించారు. అయితే ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సిక్స్ ప్యాక్ చేయడం పై గతంలో పలు ఇంటర్వ్యూలలో కూడా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తన మనసులో మాట బయటకు చెప్పారు.



 ప్రస్తుతం వస్తున్న ఎంతోమంది యువ హీరోలు సిక్స్  ప్యాక్ కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే సిక్స్ ప్యాక్ మీరు ఎందుకు ప్రయత్నించలేదు అని ఎంతో మంది తనను  అడుగుతూనే ఉంటారు అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్. నిజంగా చెప్పాలంటే తనకు సిక్స్ ప్యాక్ చేయాలి అనే దానిపై ఎప్పుడూ ఆసక్తి లేదు. నేను ధైర్యం అనే బలం కోసం పని చేసే వాడిని. కండలు ఎవరైనా పెంచడానికి అవకాశం ఉంటుంది కాని గుండె ధైర్యాన్ని పెంచుకోవడం చాలా కష్టం. ఒక రాజకీయ నాయకుడిగా కూడా ప్రజల్లోకి వెళ్లడానికి ఎంతో ధైర్యం కావాలి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: