జెనీలియా..బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో అల్లరి అమ్మాయిగా ఎప్పటికి నిలిచిపోతుంది. 1982 ఆగస్టు 5 జన్మించిన జన్మించిన ఈమె 15 యేళ్ళ వయసులో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. అమితాబ్ బచ్చన్ తో పార్కర్ పెన్ కమర్షియల్ యాడ్లో మొదట కనిపించి, దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈమె తల్లి  జినెట్ కాగా, తండ్రి పేరు నీల్. ఇద్దరి పేర్లు కలిపి జెనీలియా అని పెట్టారు. ఇక మోడలింగ్ చేస్తున్న క్రమం లో తొలి సారి హిందిలో తుజే మేరి కసం అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో రితేష్ దేశముఖ్ హీరో గా నటించగా, ఆ తర్వాత అతడినే పెళ్ళాడి దేశముఖ్ ల ఇంటి కోడలు అయ్యింది. రితేష్ తండ్రి విలాస్ రావు దేశముఖ్  అప్పట్లో ముఖ్యమంత్రిగా పని చేసారు..రితేష్ జెనీలియా దంపతులకు ఇద్దరు పిల్లలు.

ఇక అదే ఏడాది బాయ్స్ సినిమాతో తమిలో, సత్యం సినిమాతో తెలుగులో రంగ ప్రవేశం చేసిన జెనీలియా కెరీర్ మొత్తం లో 50 సినిమాల వరకు చేసింది. ఆమె తెలుగులో చివరగా నటించిన చిత్రం దగ్గుబాటి రానా హీరో గా నా ఇష్టం. ఇక్కడ నుండి ఆమె కెరీర్ ముగిసిపోయింది. అందుకు కారణం ఆమె రితేష్ ని పెళ్లి చేసుకోవడం అని అంత అనుకుంటారు కానీ.బయట ప్రపంచానికి తెలియని మరో విషయం కూడా ఉంది. 2012 లో ఆమె పేరు పైన చీటింగ్ కేసు నమోదయ్యింది. హైదరాబాద్ లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసింది. ఆ సంస్థ సామాన్యుల నుండి 300 వందల కోట్ల రూపాయలు సిటీ బయట డుప్లెక్స్ హౌసెస్ కట్టిస్తామని మాట ఇచ్చి డబ్బులు వసూల్ చేసుకొని కట్టించకపోవంతో వీరిపై కేసు నమోదయ్యింది. సామాన్య ప్రజలను జెనీలియా వంటి హీరోయిన్స్ ని ఆశ చూపించి కోట్లకు కోట్లు డబ్బులు గుంజుకొని మోసం చేసారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక అప్పటికే జెనీలియా మామగారు మంత్రిగా ఉండటంతో ఆమె ఈ కేసు నుండి బయటపడి ఇక సినిమాలు వద్దు బ్రాండ్ ఆమసిడర్లు వద్దు అనుకోని హైదేరాబద్ నుండి మకాం ముంబై కి మార్చింది. చివరగా డిసెంబర్ 25 2012 లో తన మొదటి హీరో, సోల్ మెట్అ యినా రితేష్ ని పెళ్లాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: