వ‌రుస ప్లాపుల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టాడు. ఆ మాట‌కు వ‌స్తే పూరి జ‌గ‌న్నాథ్‌కు సైతం ఆరు వ‌రుస ప్లాపుల త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ రూపంలోనే హిట్ వ‌చ్చింది. ఇస్మార్ట్ త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రామ్ రెడ్ సినిమాలో న‌టించాడు. క‌రోనా లాక్ డౌన్‌కు ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రెడ్ ప‌లు వాయిదాలు ప‌డింది. ఒకానొక ద‌శ‌లో ఓటీటీలో రిలీజ్ చేద్దామ‌నుకున్నా చివ‌ర‌కు ప‌ట్టుబ‌ట్టి థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేశారు.

సంక్రాంతి కానుక‌గా నాలుగు సినిమాల‌కు పోటీగా విడుద‌ల అయిన రెడ్‌కు ఓ మోస్త‌రు టాక్ వ‌చ్చింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రు. 6.7 కోట్ల షేర్ వ‌చ్చింది. ఓ వైపు క్రాక్ సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో పాటు మాస్ బ్యాచ్ అంతా ఆ సినిమా ఆడుతోన్న థియేట‌ర్ల వైపు పరుగులు పెట్ట‌డం... ఇటు విజ‌య్ మాస్ట‌ర్‌కు తోడు బెల్లంకొండ అల్లుడు అదుర్స్ సినిమా కోసం కొన్ని థియేట‌ర్లు లాగేసుకున్నా కూడా రెడ్ స్ట్రాంగ్‌గానే ప‌రుగులు పెడుతోంది.

బీ, సీ సెంట‌ర్ల‌లో ఈ సినిమాకు మంచి వ‌సూళ్లు వస్తాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అదే స‌మ‌యంలో ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా త‌ర్వాత రామ్‌కు బీ, సీ సెంట‌ర్ల‌లో ఫ్యాన్స్ బాగా పెరిగారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు రెడ్ సైతం క్రాక్‌కు ధీటుగానే ఈ రెండు సెంట‌ర్ల‌లో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  

తొలి రోజు నైజాంలోనే రెడ్ 2.19 కోట్లు - సీడెడ్ లో 1.17 కోట్లు కొల్ల‌గొట్టింది. ఏదేమైనా ఒక్క మంచి హిట్ ప‌డ్డాక రామ్ క్రేజ్ పెరిగిపోయింద‌నే చెప్పాలి.
రెడ్ సినిమా కూడా హిట్ అయితే రామ్ మార్కెట్ మ‌రింత పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: