చిత్ర పరిశ్రమలో ఉన్న ఎంతోమంది నటీనటులు ఇప్పటికి కూడా పెళ్లికి దూరంగానే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. వయసు అయిపోతున్నప్పటికీ పెళ్లి అనే ఆలోచన చేయడం లేదు. అయితే ఇలా ఒకప్పుడు శృంగార భరితమైన పాత్రలలో  ఎంతగానో అలరించింది ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని కొన్నేళ్లపాటు చిత్రపరిశ్రమను ఏలిన  హాట్ బ్యూటీ షకీలా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు . అయితే శృంగార భరితమైన పాత్రలలో  నటించడం కారణంగానే షకీలా పెళ్లి చేసుకోలేదు అన్న వార్తలు కూడా ఎన్నో తెరమీదకు వచ్చాయి.



 అంతేకాదు సినిమాలలో  శృంగార భరితమైన పాత్రలలో  నటించినట్లు గానే షకీలా నిజజీవితంలో కూడా అలాగే ఉంటుంది అని ఎన్నో వార్తలు తెర మీదికి వచ్చాయి అనే విషయం తెలిసిందే.  అయితే అలనాటి హాట్ బ్యూటీ షకీలా ఇటీవలే  ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలోనే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన పలు చేదు అనుభవాలను ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో బయటపెట్టి అభిమానులతో పంచుకున్నారు షకీలా. ఇక ఈ షోలో భాగంగా షకీలా పెళ్లి గురించి సంబంధించిన నిజం బయట పెట్టారు.



 తన తల్లి చనిపోయిన తర్వాత తన పెళ్లి సెట్ అయిందని.. శుభలేఖలు కూడా ప్రింట్ చేయించారని కానీ ఆ తర్వాత తనకు కాబోయే భర్త.. తాగొచ్చి నీకు ఉన్న చెడు అలవాట్లు మానేస్తేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో  కోపం వచ్చిందని దీంతో హ్యాంగర్ తీసుకొని అతని చితకబాదాను  అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత అతని తల్లిదండ్రులు వచ్చి ఒక పెద్ద బిల్డింగ్ బహుమతిగా ఇస్తాం తమ కొడుకును పెళ్లి చేసుకోవాలి అంటూ బ్రతిమిలాడారని.. పెద్ద బిల్డింగ్ లో మధ్యలో ఉరి వేసుకోవాలా అంటూ వాళ్ళని ప్రశ్నించి పెళ్లి క్యాన్సిల్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది షకీలా. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: