మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మనోడికి మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా చరణ్ కు ఉపయోగపడినంత బాగా ఈ సినిమాలో పరిచయమైన హీరోయిన్ నేహా శర్మ కి ఉపయోగపడే లేదనే చెప్పాలి. ఈ సినిమా రిఫరెన్స్ తో తెలుగులో చాలా అవకాశాలు వచ్చినా ఎందుకోగానీ ఈ భామ ఇక్కడ క్లిక్ కాలేకపోయింది. 

సైలెంట్ గా బాలీవుడ్ వెళ్లిపోయిన ఈ భామ అక్కడ మంచి సినిమాలు చేసింది. ప్రస్తుతానికి మ్యూజికల్ ఆల్బమ్స్ అలాగే వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ త్వరలోనే ఐటం భామగా మారబోతోంది అంటున్నారు. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి నేహాశర్మ త్వరలో ఒక తెలుగు సినిమాలో ఐటెం సాంగ్ చేయనుందట. ఒక కుర్ర హీరో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఈ భామ ఐటమ్ సాంగ్ ఒప్పుకుందని అంటున్నారు. 

అయితే ఆ కుర్ర హీరో ఎవరు ? ఏమిటి ? అనే విషయాలు ప్రస్తుతానికి ఇంకా తెలియక పోయినా టాలీవుడ్ లో ఆయనకు మంచి క్రేజ్ ఉందని అంటున్నారు. ఇక ఈ భామ మొదటి సినిమాతోనే మంచి డాన్సర్ అని కూడా అనిపించుకుంది. సో ఈ భామకు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఐటమ్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించి ఆ తరువాత సౌత్ ఇండస్ట్రీ మీద ఈ భామ దృష్టి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అయ్యి ఈ భామ మళ్ళీ సౌత్ సినిమాల్లో బిజీ అవుతుంది అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: