అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాశిఖన్నా.ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ ఆ  తర్వాత వరుస విజయాలు అందుకుంటూ వస్తుంది.  అందం పరంగానే కాదు ప్రతి సినిమాలో రాశీఖన్నా నటనకు ప్రశంశలు దక్కాయి.. అభినయం పరంగా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆవగింజంత కూడా వంకబెట్టలేని అందంతో ఆమె కుర్ర ప్రేక్షకుల గుండె గోడలను కూల్చేసింది. వాళ్ల కలల కోటలో మెరుపులా మేను వాల్చేసింది. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో సినిమాలు చేసినా రాశి కి ఎందుకో స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు..

కొన్ని సినిమాల ఎంపిక వల్లే ఆమె ఈ స్థాయికి చేరలేకపోయిందని అంటున్నారు సినీ పరిశీలకులు.. ఒక హిట్ కొడితే ఇంకో సినిమా ఫ్లాప్ అవడం రాశికి కెరీర్ లో జరగగా ఫ్లాప్ అయితే ఆ క్రెడిట్ మొత్తం ఆమెకే దక్కేది.. ఆమె కెరీర్ లో సరైన హిట్ అంటే తొలిప్రేమ అని చెప్పాలి..తెలుగులో ఆమెకు అదే ఆఖరి హిట్ అని చెప్పాలి. ఈమధ్యే వచ్చిన ప్రతిరోజు పండగ సినిమా హిట్ అయినా ఆ క్రెడిట్ అంతా సాయి ధరమ్ తేజ్ కొట్టేశాడు. తనకు సో సో మార్కులే పడ్డాయి.. ఈ సినిమా తర్వాత చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆమె కెరీర్ భారీ డిజాస్టర్ సినిమా అని చెప్పాలి. రాశి ఖన్నా తన కెరియర్లో చేసిన పొరపాటు ఏదైనా ఉందంటే 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో 'యామిని' పాత్రకి ఓకే చెప్పడమే.

అప్పటివరకూ పద్దతికి పట్టుచీరకట్టినట్టు కనిపిస్తూ వచ్చిన ఈ అమ్మాయిని ఆ పాత్రలో అభిమానులు  అంగీకరించలేకపోయారు. ఆ సినిమా పరాజయంపాలు కావడంతో వ్రతం చెడినా ఫలితం దక్కకుండా పోయింది. ఈ సినిమా తరువాత రాశి ఖన్నా వరుసగా తమిళ సినిమాలను ఒప్పుకోవడం విశేషం. తెలుగులో కొత్త ప్రాజెక్టులలో ఎక్కడా ఆమె పేరు వినిపించడం లేదు. కనీసం గాసిప్స్ లో కూడా కనబడటం లేదు. మరి తెలుగులో సినిమా అవకాశాలు రాక అటు వెళ్ళిందా..లేక అలిగి వెళ్లి అక్కడ సినిమాలు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: