ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ వివేక్ నేడు తెల్లవారుజామున హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి నటుడిగా ఆడియన్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న వివేక్ ఎప్పటికప్పుడు పలు సేవా, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అలానే చెట్లు నాటడం మొక్కల పెంపకం వంటి వాటిపై ప్రజలకు తరచూ అవగాహన కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనే వివేక్ మూడు రోజుల క్రితం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మహమ్మారి నుంచి ప్రజలందరూ తప్పించుకోవాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే అంటూ ఆ సందర్భంగా ఆయన పోస్ట్ చేయడం జరిగింది.

అయితే హఠాత్తుగా నిన్న సాయంత్రం గుండెపోటుతో విలవిలలాడుతున్న వివేక్ ని ఆయన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చారు. అనంతరం ఆయన్ని వడపళనిలోని సిమ్స్ ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఎక్మా సపోర్ట్ ద్వారా ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ఆ తర్వాత డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వివేక్ ఆరోగ్యం సహకరించకపోవడంతో తెల్లవారుజామున ఆయన మరణించడం జరిగింది. ఇక వివేక్ హఠాన్మరణంతో ఒక్కసారిగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదం లోకి వెళ్ళిపోయింది.

పలువురు సినీ ప్రేక్షకులు ప్రముఖులు వివేక్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్ చేస్తున్నారు. ఇక కొద్ది సేపటి క్రితం యువ నటుడు విశాల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందిస్తూ వివేక్ గారితో తనకు ఎంతో గొప్ప అనుబంధం ఉందని తొలిసారిగా తన సినీ రంగ ప్రవేశం జరిగిన తొలి షాట్ ఆయన తోనే ప్రారంభం అయిందని అందరితోనూ ఎంతో కలుపుగోలుగా సరదాగా వ్యవహరించే వివేక్ గారు నేడు మన మధ్య లేరు అనే వార్తను తాను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ విశాల్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు......!!



మరింత సమాచారం తెలుసుకోండి: