ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లుగా ఈ మధ్యనే ప్రకటన వెలువడింది.

నిజానికి ముందు ఈ సినిమా త్రివిక్రమ్తో చేయాలనే ప్లాన్ చేసినా సరే అనుకోని కారణాలతో కొరటాల శివ పేరు తెరమీదకు వచ్చింది. అయితే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేయబోతున్నాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. త్వరలోనే ఈ ప్రచారం నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ 31 వ సినిమాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

 దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే మే 20వ తేదీన  వెలువడే అవకాశం కనిపిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోయే ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రొడక్షన్ చేయనుంది. నిజానికి వీరి కాంబినేషన్లో ఒక సినిమా చేస్తామని గతంలోనే ఒక ఇంటర్వ్యూలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు ప్రకటించారు. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆ ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. నిజానికి ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కే జి ఎఫ్ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే ప్రభాస్ తో సలార్ అనే సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: