కరోనా సెకండ్ వేవ్ తారా స్థాయికి చేరుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ప్రశ్నార్థకంగానే మారింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అధికారికంగా వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి అనధికారికంగా వీటి సంఖ్య ఊహించిన స్థాయికన్నా చాల ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో లాక్ డౌన్ లు కర్ఫ్యూలు లేకపోయినా జనం తమకు తాముగానే స్వచ్చందంగా గృహ నిర్భంధంలోకి వెళ్ళిపోతున్నారు.


దీనితో ఈ నెలలో అదేవిధంగా వచ్చే నెలలో విడుదల కావలసి ఉన్న భారీ సినిమాలు అన్నీ వాయిదా పడుతున్నాయి. తిరిగి పరిస్థితులు జూన్ నుండి అదుపులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నప్పటికీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఏమాత్రం జరుగుతున్న పరిణామాల పై ఆశాజనకంగా లేవు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే పరిస్థితులు కుదుటపడి తిరిగి ఆగష్టు 15 నుండి భారీ సినిమాలు విడుదలయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు.


దీనితో ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న సుమారు 10 భారీ సినిమాలు ఆగష్టు 15 నుండి కనీసం రెండు వారాల గ్యాప్ తీసుకున్నా ఆ సినిమాలు అన్నీ విడుదల కావడానికి కనీసం 6 నెలలు పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతవరకు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాల పెట్టుబడికి చేసిన అప్పులు వడ్డీలు మితిమీరిన భారంగా మారిపోవడంతో అసలు నిర్మాతలకు ఏమి మిగులుతుంది ని అంటున్నారు.


ఇలాంటి పరిస్థితులలో ఈ సెకండ్ వేవ్ పరిస్థితులను ఎదిరించి నిలదొక్కుకోవడం భారీ నిర్మాతల దగ్గర నుండి చిన్న నిర్మాతలవరకు కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో మళ్ళీ హీరోలు హీరోయిన్స్ టెక్నిషియన్స్ పారితోషికాలు  తగ్గించుకోండి అన్న నినాదం మళ్ళీ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అయితే ఈ పరిస్థితులకు సహకరించే స్థితిలో టాప్ హీరోలు లేని నేపధ్యంలో ఇలాంటి కరోనా వేవ్ లు ఇంకా చాలాచాల వస్తాయి అన్న అంచనాలు ఉన్న పరిస్థితులలో ఇక సినిమాలు తీయడం అనవసరం అన్న వేదాంత ధోరణిలోకి చాల మంది నిర్మాతలు వస్తున్నట్లు తెలుస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: