అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడోతరం వారసుడు అఖిల్ అక్కినేని తొలిసారిగా హీరోగా నటించిన సినిమా అఖిల్. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యువ నటుడు నిఖిల్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ దర్శకత్వం వహించగా ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు. అయితే అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. దాని అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ నటించిన రెండో సినిమా హలో. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది.

ఇక దాని అనంతరం మిస్టర్ మజ్ను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అఖిల్. యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎబోవ్ యావరేజ్ విజయాన్ని మాత్రమే ఉంటుంది. దానితో ఎలాగైనా తదుపరి సినిమాలతో వరుస విజయాలు అందుకోవాలని పక్కాగా ప్లాన్ చేసిన అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. మంచి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా గోపీసుందర్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలానే దీని తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ఏజెంట్ పేరుతో రూపొందనున్న ఈ సినిమా యొక్క ప్రారంభోత్సవం ఇటీవల ఎంతో వైభవంగా జరిగింది. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా నటించనున్నారని అలానే అఖిల్ నుండి ఈ సినిమా ద్వారా భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా చూడవచ్చని అంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ సినిమాల ద్వారా అఖిల్ తప్పకుండా రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. మరి అదే కనుక జరిగితే వారికి అంతకంటే ఆనందం ఏముంటుంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: