టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారుండరు. ఇండ్రస్టీ లో అగ్ర హీరోగా తనకంటూ మంచి అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు బాలయ్య. అయితే సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా బాలయ్యను అభిమానించే సినీ తారలు చాలామంది ఉన్నారు మన ఇండ్రస్టీ లో.. ముఖ్యంగా బాలయ్య మంచి మనసు గురించి పలువురు సినీ నటులు పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలయ్య నిజ స్వరూపం గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు సినీ నిర్మాత చంటి అడ్డాల. చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోలతో పలు సినిమాలను నిర్మించిన చంటి అడ్డాల.. తాజాగా బాలయ్య ఇచ్చిన మాట పట్ల ఎంత కమిట్మెంట్ తో ఉంటారో చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో బాలయ్య కు తనకి మధ్య జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ.. పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.. ఇక ఆ సంఘటన గురించి చంటి అడ్డాల మాట్లాడుతూ.."ఓ సినిమాకి సంబంధించి ఔట్ డోర్ షూట్ కి స్విట్జర్లాండ్ వెళ్ళాము.. అప్పుడు బాలయ్య గారికి.. బాబు మీకు బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేస్తానంటే.. నాకు బిజినెస్ క్లాస్ టికెట్ ఎందుకు ఫ్లైట్ లో ఏ క్లాస్ అయినా తేడా వస్తే అందరూ ఒకటే కదా..అదే అందరూ కూర్చునే చోట అయితే సరదాగా మనం అందరం మాట్లాడుకోవచ్చు..నన్ను సెపరేట్ గా పెడితే నాకు లోన్లీ నెస్ గా ఉంటుంది.. వద్దు.. అందరం కలిసే వెళదాం అని అన్నారు.అలా అందరి హీరోల్లాగా బిజినెస్ క్లాస్ టికెట్స్ అడిగే వారు కాదని..

ఇక లొకేషన్స్ లో అయినా.. ఎయిర్ పోర్టు లో అయినా తన లగేజ్ తానే మోసుకెళ్లేవాడని..ఇంకా షూటింగ్ స్పాట్ లో సీన్ అయిపోయాక ఎక్కువగా కారులో కూర్చునే వారు కాదని.. ఎంత ఎండ ఉన్న లొకేషన్ లోనే ఉండేవారని.. బాలయ్య అంత సింపుల్ గా ఉండేవారని చెప్పుకొచ్చారు..అంతేకాదు ఆయన మాట ఇస్తే అదే మాటకి కట్టుబడి ఉంటారు. టైమ్ విషయంలో చాలా క్రమశిక్షణను పాటిస్తారు. అలాంటి బాలయ్య గారిని ఆయన తిక్క తిక్కగా మాట్లాడుతారు.. ఇష్టం వచ్చినట్లు ప్రవరిస్తాడాని ఎంతో మంది అంటారు.. కానీ అది కరెక్ట్ కాదు. నేను ఆయనతో కలిసి ట్రావెల్ చేసాను కాబట్టి.. దగ్గరుండి ఆయన్ని చూసాను కాబట్టి.. బాలయ్య బాబు అంటే ఏంటో నాకు తెలుసని" ఈ ఇంటర్వ్యూలో వివరించారు నిర్మాత చంటి అడ్డాల..!!

మరింత సమాచారం తెలుసుకోండి: