తెలుగు సినిమా పరిశ్రమలో రెండు కళ్ళ లాంటి వారు నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు. నందమూరి తారకరామారావు గారి కంటే ముందుగా ఏఎన్నార్ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించారు. ఏఎన్ఆర్ గా ఆయన ప్రేక్షకుల మన్ననలను పొంది అభిమానాన్ని చూరగొన్నాడు ఏఎన్నార్. నాటకరంగం ద్వారా కళారంగంలో కి వచ్చిన అయన తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్ర కథానాయకులతో ఒకరిగా ఎదిగారు.

నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ఎంతో ప్రాముఖ్యత పొందిన నాగేశ్వరరావు ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూశాడు. ఆ తర్వాత సినిమాలకు పరిచయం చేశాడు. ధర్మపత్ని సినిమాతో సినీజీవితం అప్పటినుండి రకరకాల తెలుగు తమిళ సినిమాలలో 75సంవత్సరాల పైగా నటించాడు. ఎన్.టి.ఆర్ తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు. అలా ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించారు. అయన తరువాత అయన తనయుడు నాగార్జున ను సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు.

1986 లో ఆయన నటించిన మొదటి చిత్రం విక్రమ్ రిలీజ్ అయింది. హిందీ చిత్రం హీరోకి ఇది అనువాదం. తర్వాత నాలుగు చిత్రాల్లో నటించిన ఆయన కు లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. ఇక ఆయన కెరీర్ మలుపు తిప్పిన చిత్రాలలో  గీతాంజలి, శివ, అన్నమయ్య, నిన్నే పెళ్ళాడుతా వంటి చిత్రాలు ఉన్నాయి..ఎన్ని సినిమాలు చేసినా ఎంత ఎత్తు ఎదిగినా నాగార్జున కి తండ్రి అంటే ఎంతో అభిమానం.. ఈ తండ్రి కొడుకులు కూడా కలిసి చాలా సినిమాల్లో నటించారు. వారు కలిసి నటించిన చివరి చిత్రం మనం..  ఇద్దరు ఒకరికి ఉన్న ప్రేమను చూడచక్కగా చూపిస్తూ ఉంటారు. తండ్రి మీద అమితమైన ప్రేమ తో ఆయనతో చివరిగా ఒక సినిమాలో నటించాలని మనం సినిమా తీసి ఆయనకు అంకితమిచ్చారు నాగార్జున. తండ్రిని ఇంత ప్రేమించే టాలీవుడ్ హీరోల్లో మొదటి స్థానంలో నాగార్జున ఉంటాడు అని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: