ఆర్ఆర్ఆర్ సినిమాపై రోజురోజుకు ఆడియన్స్ లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. మొదట ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తోనే సినిమా ఎంత గ్రాండియర్ గా ఉండబోతోంది అనేది కొంత సూచన ప్రాయంగా వెలువరించింది యూనిట్. ఆ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ టీజర్, అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం ఫస్ట్ లుక్ టీజర్స్ రిలీజ్ చేయడం, అవి ప్రేక్షకాభిమానులు నుండి విపరీతమైన క్రేజ్ దక్కించుకోవడంతో సినిమా పై అంచనాలు విపరీతంగాపెరిగాయి.

ఇక రెండు రోజుల క్రితం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ నుండి విడుదలైన దోస్తీ సాంగ్ కూడా అందరి నుండి మంచి స్పందన వస్తుండడంతో యూనిట్ ఆనందాన్ని వ్యక్తపరుస్తోంది. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దాదాపుగా రూ.500 కోట్ల భారీ వ్యయంతో దానయ్య నిర్మిస్తుండగా కేకే సెంథిల్ కుమార్  ఛాయాగ్రాహకుడిగా,  కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో భారతీయ సినిమా పరిశ్రమలోని పలు భాషల నటులతో పాటు కొందరు హాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రలు చేస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి.

ముఖ్యంగా సినిమాలో హీరోలు ఇద్దరూ కూడా ఒకర్ని మించేలా మరొకరు తమ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి సహజ నటన కనబరిచారని, వీరిద్దరి ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటు ఇద్దరూ కలిసి పోరాడే ఫస్ట్ ఫైట్, అలానే క్లైమాక్స్ సీన్స్ యావత్ సినిమా కే హైలైట్ అని సమాచారం. మరోవైపు దర్శకుడు రాజమౌళి ఏ విషయం లోనూ ఏ మాత్రం రాజీ పడకుండా సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా సినిమా విడుదల తరువాత గొప్ప సంచలన విజయం అందుకోవడం ఖాయం అంటున్నాయి పలు ఇన్నర్ వర్గాలు. మరి అక్టోబర్ 13న రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకోనుందో చూడాలి ...... !!


మరింత సమాచారం తెలుసుకోండి: