వరుస ఫ్లాపులతో సతమతమవుతూ క్రేజ్ నీ తగ్గించుకుంటున్న నాని సినిమాలు చేయడంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ఆయన నటించిన టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసి భారీ ఫ్లాప్ సొంతం చేసుకున్న నాని ఇప్పుడు ఒకే సారి రెండు సినిమాల్లో నటిస్తూ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్న నాని ఆ తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. 

అంటే సుందరానికి అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నజ్రియా నటిస్తుండగా ఈ రెండు చిత్రాలతో మళ్లీ కం బ్యాక్ చేయాలని ఆయన భావిస్తుండటం విశేషం. ఈ రెండు సినిమాల చిత్రీకరణ దాదాపుగా పూర్తయిన విధంగా ఉండటంతో ఇప్పుడు నానీ తన తదుపరి చిత్రాల గురించి ఆలోచిస్తున్నాడట.  ఈ నేపథ్యంలోనే ఓ కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. నానీ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఆ దర్శకుడు ఓ అద్భుతమైన కథను రెడీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాని.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక టైటిల్ చక్కర్లు కొడుతుంది. దసరా అనే టైటిల్ ను ఈ చిత్రానికి ఫిక్స్ చేశారని వార్తలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా రూపొందుతుందని నాని నీ గతంలో ఏ దర్శకుడు చూపించిన విధంగా ఈ సినిమాలో కొత్త దర్శకుడు చూపించబోతున్నాడు అని తెలుస్తుంది. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని తెలుస్తుంది. దసరా రోజు టైటిల్ పోస్టర్ తో పాటు ఉన్న ఇల్లు కూడా రివిల్ చేస్తారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా ప్రస్తుతం టెక్నీషియన్స్ ను నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీకాంత్ ఈ చిత్రానికి దర్శకుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: