జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్ అవార్డు అందుకున్నారు. మణికర్ణిక చిత్రానికి కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికయ్యారు. ఇక దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచోరే.. ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డును అందుకున్నది. అసురన్ చిత్రంలో అద్భుతమైన నటనకు ధనుష్ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కించుకున్నాడు. సూపర్ డీలక్స్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడు అవార్డు విజయ్‌సేతుపతికి దక్కింది. మలయాళం జల్లికట్టు సినిమాకు గాను బెస్ట్ సినిమాటోగ్రఫీగా గిరీష్ గంగాధరన్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును మలయాళం మూవీ మరక్కర్ దక్కించుకున్నారు.
అదేవిధంగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు విశిష్ట పురస్కారం లభించింది. సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు ఆయనకు వరించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలు కేంద్రప్రభుత్వం గుర్తించి ఆయనను ఈ పురస్కారంతో గౌరవించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రజినికాంత్‌కు అవార్డును అందజేశారు. మరోవైపు ఒకే యేటా రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల సూపర్‌స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు