దర్షక ధీరుడు, బాహుబలి బ్రహ్మ రాజమౌలి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ట్రిపుల్ ఆర్.. ఆయన చేస్తున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవల్.. అందుకే ఈ సినిమా పై కూడా మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. బాలివుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాలో లీడ్ రోల్ లో కనిపిస్తున్నారు.


సినిమా మొదలు అయ్యి చాలా కాలం అయ్యింది. జక్కన్న సినిమాలు అంటే మాములుగానె లెట్..ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే. కొన్ని అడ్డంకులు ఎదురైనా కూడా సినిమా షూటింగ్ ను ఆపలేదు. మొత్తానికి షూటింగ్ ను పూర్తీ చేసుకున్నారు. కానీ, సినిమా విడుదల మాత్రం అభిమానులకు ఆందోళన కలిగిసిస్తుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అంతే కాదు సెన్సార్ ను పూర్తీ చేసుకుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. యూఏఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు ఆర్ ఆర్ ఆర్ మూవీ సెన్సార్ రిపోర్ట్ పై కామెంట్ చేశారు.అంతేకాదు మూవీ పై ఒక క్లారిటీ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.


ఇది ఇలా ఉండగా అన్నీ కార్యక్రమాలను పూర్తి చెసుకున్నా కూడా విడుదలకు నొచుకొలెదు. అందుకు కారణం కూడా లేకపోలేదు.. కరోనా మహమ్మారి మళ్ళీ వేగంగా విజ్రుంభిస్తున్న నేపథ్యం లో ఇలాంటి షాక్ లు తగులుతున్నాయి. జనవరి 7న ఆర్ ఆర్ ఆర్, 14న రాధే శ్యామ్ విడుదల కావాల్సి ఉంది. అనూహ్యంగా ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు సంక్రాంతి బరి నుండి తప్పుకున్నాయి. పలు రాష్ట్రాలలో పాక్షికంగా కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. థియేటర్స్ పూర్తిగా మూసివేయడం, లేదా యాభై శాతం ఆక్యుపెన్సీ తో నడపడం జరుగుతుంది.దీంతో సినిమా వాయిదా పడింది. ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేసే ఆలోచనలతో ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.. విడుదల తేదీ మాత్రం తెలియలేదు. అధికారికంగా ప్రకటించె వరకూ ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: