గత ఏడాది వకీల్ సాబ్ ద్వారా ప్రేక్షకాభిమానులు ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తీస్తున్న భీమ్లా నాయక్ కాగా మరొకటి క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ మూవీ హరిహర విరమల్లు. ఇక వీటిలో భీమ్లా నాయక్ చాలా వరకు చిత్రీకరణ జరుపుకోగా దీని లేటెస్ట్ షెడ్యూల్ ని ఈ నెల 25 నుండి మొదలెట్టనున్నట్లు టాక్.

రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ పవన్ కి జోడీగా నటిస్తుండగా మరొక కథానాయికగా సంయుక్త మీనన్ కనిపించనున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు థమన్ స్వరపరిచిన సాంగ్స్ శ్రోతలు అందరినీ ఎంతో ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసాయి. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం కి రీమేక్ గా రూపొందుతున్న భీమ్లా నాయక్ మూవీ గురించి నేడు ఒక ఇంటర్వ్యూ లో భాగంగా సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ, ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఎంతో అద్భుతంగా యాక్ట్ చేసారని, రెండు రోజుల క్రితం దర్శకుడు సాగర్, అలానే రైటర్ త్రివిక్రమ్ తో కలిసి సినిమా రషెస్ చూసిన తనకు మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మంచి నమ్మకం ఏర్పడిందని అన్నారు.

అలానే రానా కూడా తన పాత్రలో ఎంతో బాగా నటించారని, ఓవరాల్ గా అందరి అంచనాలు అందుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ కెరీర్ లో బీమ్లా నాయక్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తోందని థమన్ ఆశాభావం వ్యక్తం చేసారు. మొత్తంగా థమన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపుతున్నాయి. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: