నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు మంచి సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆయన హీరోగా నటించిన ఆఖరి చిత్రం భారీ స్థాయిలో విజయం సాధించడంతో ఒక్కసారిగా బాలకృష్ణ రేంజ్ పెరిగిందనే చెప్పాలి. అంతకు ముందు ఆయన చేసిన సినిమాలు దారుణంగా విఫలం కావడంతో ఒక్కసారిగా ఆయన క్రేజ్ తగ్గినట్లు అయింది. కానీ అఖండ చిత్రం ఆయనకు గతంలో ఎప్పుడూ తీసుకురాని భారీ స్థాయి ఇమేజ్ ను తీసుకు వచ్చింది. ఈ సినిమాలో ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించాడని చెప్పవచ్చు. ఇంకెవరు నటించనీ స్థాయిలో ఆయన నటించి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.

అలా ఇప్పుడు తన తదుపరి సినిమాను కూడా అదే స్థాయిలో నిర్వహించాలని భావించి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తొందర్లోనే ఈ సినిమా మొదలు కాబోతున్నగా ఈ సినిమా విడుదల కాకముందే ఆయన తదుపరి సినిమాలు చేయడంపై ఆలోచన చేస్తున్నాడు. ఇక నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తొందరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే అల్లు అరవింద్ బ్యానర్ లో కూడా బాలకృష్ణసినిమా చేయబోతున్నాడనే వార్తలు తాజా గా వినిపిస్తున్నాయి. అల్లు అరవింద్ నిర్వహిస్తు న్న ఆహా యాప్ కు సంబంధించి ఓ షో లో హోస్ట్ గా చేసిన బాలయ్య  ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయనతో సినిమా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని బాలకృష్ణకు వెల్లడించగా ఆయన కూడా ఓకే అన్నారు అని తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయం కాలే దు. ఓ అగ్ర దర్శకుడు సినిమా చేస్తాడని వెల్లడిస్తున్నారు.  ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: