తెలుగు స్టార్ హీరో, పాన్ ఇండియా హీరో అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు డార్లింగ్ ప్రభాష్.. బాహుబలి తర్వాత వరల్డ్ ఫెమస్ హీరో అయ్యాడు..అలా జెట్ స్పీడ్ లో వరుస సినిమాలను అందుకుంటూ వస్తున్నాడు.. సినిమాల హిట్ తో పని లేకుండా వరుసగా సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. బాహుబలి తర్వాత వచ్చిన అన్నీ సినిమాలు జనాలను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.ఇప్పుడు నాలుగు సినిమాలను చేస్తున్నాడు.. ఆ సినిమాలు అన్నీ కూడా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.. ముందుగా సలార్ సినిమా షూటింగ్ ను శర వేగంగా జరుపుకుంటుంది..


సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా రోజులు అయ్యింది.. ఒక్కో సీన్ జనాలకు గుర్తుండే లా డైరెక్టర్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్‌ నాయికగా కనిపించనుంది. హోంబలే ఫిలింస్‌ నిర్మాణం లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్నారు. రెగ్యులర్‌ చిత్రీకరణలో ఉందీ సినిమా. తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే చిత్రీకరణకు ప్రభాస్‌ సిద్ధమవుతున్నారని సమాచారం. భావోద్వేగాల తో కలిసి యాక్షన్‌ కథతో ఈ సినిమా నిర్మితమవుతున్నది.


భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు కదిలించే ఎమోషన్‌ కూడా చిత్రంలో ఉంటుందని తెలుస్తున్నది. ప్రభాస్‌ ఈ సినిమాతో పాటు 'ప్రాజెక్ట్‌ కె' చిత్ర షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఆయన నటించిన 'ఆది పురుష్‌’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది... ఈ సినిమాల లో ఒక్కటి హిట్ అయిన కూడా డార్లింగ్ రేంజ్ ను రీచ్ అవ్వడం చాలా కష్టం .. మళ్ళీ వరల్డ్ హీరో అవుతాడు..అన్నీ సినిమాలు దాదాపు షూటింగ్ ను పూర్తీ చేశాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఒక్కో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాలు ఎప్పుడూ విడుదల అవుతాయా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: